
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్షల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా పరీక్షకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే హాల్‌టికెట్ల జారీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, అధికారులు వాటిని సాంకేతిక కోణంలో మరోమారు పరిశీలించనున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెండు రోజుల్లో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రూప్–1 కేటగిరీలో 503 కొలువులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయగా 3,80,202 మంది దరఖాస్తులు సమర్పించారు. వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment