
హైదరాబాద్: గ్రూప్-1పై రేపు (మంగళవారం) హైకోర్టు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించనుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో 10కి పైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్- 1పై హైకోర్టులో తీర్పు వెల్లడిపైసస్పెన్స్ వీడనుంది.
పలు పిటీషన్లపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పుని రిజర్వ్ చేసింది. గత విచారణలో నేడు తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు చెప్పంది. అయితే సోమవారం విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పుపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment