సాక్షి, విజయవాడ: ఏపీలో రేపు గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. రాష్డ్ర వ్యాప్తంగా 89 పోస్టులకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ పరీక్షకు 1,48,881 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లగా గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 ప్రిలిమనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ -1 జనరల్ స్టడీస్ పరీక్ష, ఉదయం 9.45 గంటల వరకు అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ -2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్షకి 18 జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమారాలతో పర్యవేక్షించనున్నారు.
గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్‌లను నియమించారు. జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని అభ్యర్ధులకు ఎపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమనరీ నిర్వహణకు 301 మంది లైజనింగ్ అధికార్లు, 6612 మంది ఇన్విజలేటర్లు నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 39 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి: ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..
Comments
Please login to add a commentAdd a comment