సివిల్స్‌– 2021 ప్రిలిమ్స్‌ పరీక్ష.. ఈ నాలుగు సక్సెస్‌కు కీలకం | UPSC Civil Services Prelims 2021: Preparation Strategy, Syllabus, Exam Date | Sakshi
Sakshi News home page

UPSC Prelims 2021: తొలి అడుగు తడబాటులేకుండా!

Published Tue, Sep 7 2021 6:06 PM | Last Updated on Tue, Sep 7 2021 6:50 PM

UPSC Civil Services Prelims 2021: Preparation Strategy, Syllabus, Exam Date - Sakshi

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా 19 ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియలో తొలిదశ! ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపితే.. సివిల్స్‌లో విజయం దిశగా మొదటి అడుగు పడినట్లే! ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారని అంచనా! ఇంతటి తీవ్ర పోటీ నెలకొన్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో గట్టెక్కి.. మలిదశ మెయిన్‌కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఎంతో శ్రమిస్తుంటారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2021 పరీక్ష.. అక్టోబర్‌ 10న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్‌ వ్యూహాలు, ఫోకస్‌ చేయాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం...

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్‌ 10వ తేదీన జరగనుంది. అంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 33 రోజులు మా త్రమే. ప్రిలిమ్స్‌ అనే మైలురాయిని దాటేందుకు ఈ సమయం ఎంతో కీలకం. సివిల్స్‌ అభ్యర్థులు ఈ అమూల్యమైన సమయంలో ముఖ్యంగా నాలుగు విజయ సూత్రాలు పాటించాలి అంటున్నారు నిపు ణులు. అవి..విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్‌. ఈ నాలుగు సూత్రాలు పక్కాగా అమలు చేస్తే..ప్రిలిమ్స్‌లో విజయావకా శాలు మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు. 

సమయ పాలన
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులకు టైం మేనేజ్‌మెంట్‌ చాలా అవసరం. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో పేర్కొన్న ఏడు విభాగాలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ప్రతి సబ్జెక్ట్‌ను నిత్యం చదివేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం అధ్యయనం పూర్తిచేసిన టాపిక్స్‌పై సెల్ఫ్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయాలి. తద్వారా ఆయా అంశాలపై తమకు లభించిన అవగాహనను విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన కూడా లాభిస్తుంది.


కరెంట్‌ అఫైర్స్‌తో కలిపి

సిలబస్‌లో పేర్కొన్న కోర్‌ టాపిక్స్‌ను కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ఎందు కంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు.. కరెంట్‌ అఫైర్స్‌ సమ్మిళితంగా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు 2020 జూలై నుంచి 2021 జూలై వరకూ జరిగిన.. ముఖ్యమైన కరెంట్‌ ఈవెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. సంఘటనల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా.. వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవడం చాలా అవసరం.

అనుసంధానం చేసుకుంటూ
ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లను ఇతర సబ్జెక్ట్‌లతో అనుసంధానం చేసు కుంటూ చదవాలి. ముఖ్యంగా ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హిస్టరీ–పాలిటీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. దీనివల్ల ప్రిపరేషన్‌ పరంగా ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది. ఇలా మిగిలిన సమయంలో తాము క్లిష్టంగా భావించే.. ఇతర ముఖ్య టాపిక్స్‌పై దృష్టిపెట్టొచ్చు. 

ముఖ్యాంశాల గుర్తింపు
ప్రస్తుతం సమయంలో..అభ్యర్థులు సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యాంశాలను గుర్తించాలి. అందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో సబ్జెక్టుల వారీగా ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధా న్యం లభించిందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రలో.. సాంస్కృతిక చరిత్ర, రాజ్య వంశాలు వంటి వి. అలాగే ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌లో గత ఏడాది కాలంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. ప్రధానంగా కరోనా పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై చూపిన ప్రభావం, వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు ముఖ్యమైనవిగా గుర్తించాలి. అదే విధంగా..ఆయా దేశాల మధ్య ఒప్పందాలు–వాటి ఉద్దేశం–అంతర్జాతీయంగా, జాతీయంగా వాటి ప్రభావం తదితర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

కొత్త అంశాలు చదవాలా
విస్తృతమైన సివిల్స్‌ సిలబస్‌ ప్రిపరేషన్‌ క్రమంలో అభ్యర్థులు కొన్ని టాపిక్స్‌ను వదిలేస్తుంటారు. అలా విస్మరించిన అంశాలను ఇప్పుడు చదవడం సరైందేనా.. అనే సందేహాన్ని చాలామంది అభ్య ర్థులు వ్యక్తం చేస్తుంటారు. గతంలో చదవకుండా వదిలేసిన టాపిక్స్‌లో కొరుకుడు పడని అంశాలుం టే.. అనవసర ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి విస్మరించిన అంశాలను ఇప్పుడు కొత్తగా చదవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పట్టు బిగించిన వాటినే మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ కొత్త అంశాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. కాన్సెప్ట్‌లపై అవగాహన పొందితే సరిపోతుంది.  


పేపర్‌–2కు కూడా సమయం

అభ్యర్థులు పేపర్‌–2(సీశాట్‌)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అర్హత పేపర్‌గానే పేర్కొ న్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధి స్తేనే.. పేపర్‌–1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధా రంగానే మెయిన్‌కు ఎంపిక చేస్తారు. పేపర్‌–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్‌ రీజనింగ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. 

రెండుసార్లు రివిజన్‌
సిలబస్‌ అంశాల ప్రిపరేషన్‌ సెప్టెంబర్‌ చివరికల్లా పూర్తి చేసుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి. ప్రతి రోజూ కొంత సమయం రివిజన్‌కు కేటాయిస్తూ.. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేయాలి. రివిజన్‌కు ఉపకరించేలా ప్రిపరేషన్‌ సమయంలోనే ఎప్పటికప్పుడు షార్ట్‌నోట్స్‌ రాసుకోవాలి. 

మెమొరీ టిప్స్‌
ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్‌ సాధన చేయాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్‌ టెక్నిక్స్, అన్వయించుకోవడం వంటి వాటి ద్వారా మెమొరీ పెంచుకోవాలి. ఇలా ప్రతి విష యంలో నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. ప్రిలి మ్స్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.


సబ్జెక్ట్‌ వారీగా ఇలా

కరెంట్‌ అఫైర్స్‌: కరోనా పరిణామాలు, అభివృద్ధి కారకాలపై చూపుతున్న ప్రభావం; గత ఏడాది కాలంలో ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణాం కాలు; ముఖ్యమైన నియామకాలు; అంతర్జా తీయంగా పలు సంస్థల నివేదికల్లో భారత్‌కు సంబంధించిన గణాంకాలు.

చరిత్ర: ఆధునిక భారత చరిత్ర; జాతీయోద్యమం; ప్రాచీన, మధ్యయుగ భారత చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చారిత్రక అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన–పరిపాలన విధానాలు; బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు–ఉద్యమాలు,సంస్కరణోద్యమాలు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటం.

పాలిటీ: రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాం గ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు.

రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి,గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు,అటార్నీ జనరల్, అడ్వకేట్‌ జనరల్‌ వంటి వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
     
పంచాయతీరాజ్‌ వ్యవస్థ: బల్వంత్‌రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం.
ప్రభుత్వ విధానాలు: విధానాల రూపకల్పన జరిగే తీరు; విధానాల అమలు, వాటి సమీక్ష; ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు; కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత.

ఎకానమీ: ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు– మూలధన వనరుల పాత్ర.
► ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(ముఖ్యంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం వంటివి).
► ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి.
► పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం 

► పంచవర్ష ప్రణాళికలు–ప్రణాళిక రచన–వనరుల కేటాయింపు–10, 11 పంచవర్ష ప్రణాళికలు 
► బ్యాంకింగ్‌ రంగం ప్రగతి–సంస్కరణలు– ఇటీ వల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం;
► తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంక్రమిస్తున్న వ్యాధులు–కారకాలు; సైబర్‌ సెక్యూరిటీ యాక్ట్‌; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్‌ ప్రయోగాలు; ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు–పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు; వివిధ ఐటీ పాలసీలు.

జాగ్రఫీ: జనగణనకు సంబంధించిన ముఖ్యాంశాలు; అత్యధిక, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు; అత్యధిక, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు; స్త్రీ, పురుష నిష్పత్తి; స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం; గత పదేళ్లలో జనన, మరణ రేట్లు. పర్యావరణ సమస్యలు– ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు.
 
► సౌర వ్యవస్థ, భూమి అంతర్‌ నిర్మాణం, శిలలు, జియలాజికల్‌ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. 
► మన దేశంలో నగరీకరణ; రుతుపవనాలు, నదులు; జలాల పంపిణీ; వివాదాలు. 

సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2021 ముఖ్యాంశాలు
► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 712
► ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబర్‌ 10, 2021 
► రెండు పేపర్లు.. 400 మార్కులకు పరీక్ష (ఒక్కో పేపర్‌కు 200 మార్కులు).
► ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మలి దశ మెయిన్‌కు ఎంపిక
► తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement