preparation plan
-
Chinese President: తైవాన్‌పై డ్రాగన్ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి
బీజింగ్/తైపీ: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్ చైనా దూకుడుపై తైవాన్ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆ దేశాల అండ తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. -
సివిల్స్– 2021 ప్రిలిమ్స్ పరీక్ష.. ఈ నాలుగు సక్సెస్‌కు కీలకం
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియలో తొలిదశ! ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపితే.. సివిల్స్‌లో విజయం దిశగా మొదటి అడుగు పడినట్లే! ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారని అంచనా! ఇంతటి తీవ్ర పోటీ నెలకొన్న సివిల్స్ ప్రిలిమ్స్‌లో గట్టెక్కి.. మలిదశ మెయిన్‌కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఎంతో శ్రమిస్తుంటారు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 పరీక్ష.. అక్టోబర్ 10న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు, ఫోకస్ చేయాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం... సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. అంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 33 రోజులు మా త్రమే. ప్రిలిమ్స్ అనే మైలురాయిని దాటేందుకు ఈ సమయం ఎంతో కీలకం. సివిల్స్ అభ్యర్థులు ఈ అమూల్యమైన సమయంలో ముఖ్యంగా నాలుగు విజయ సూత్రాలు పాటించాలి అంటున్నారు నిపు ణులు. అవి..విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్. ఈ నాలుగు సూత్రాలు పక్కాగా అమలు చేస్తే..ప్రిలిమ్స్‌లో విజయావకా శాలు మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు. సమయ పాలన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. జనరల్ స్టడీస్ పేపర్లో పేర్కొన్న ఏడు విభాగాలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ప్రతి సబ్జెక్ట్‌ను నిత్యం చదివేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం అధ్యయనం పూర్తిచేసిన టాపిక్స్‌పై సెల్ఫ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయాలి. తద్వారా ఆయా అంశాలపై తమకు లభించిన అవగాహనను విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన కూడా లాభిస్తుంది. కరెంట్ అఫైర్స్‌తో కలిపి సిలబస్‌లో పేర్కొన్న కోర్ టాపిక్స్‌ను కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ఎందు కంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు.. కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు 2020 జూలై నుంచి 2021 జూలై వరకూ జరిగిన.. ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. సంఘటనల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా.. వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవడం చాలా అవసరం. అనుసంధానం చేసుకుంటూ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లను ఇతర సబ్జెక్ట్లతో అనుసంధానం చేసు కుంటూ చదవాలి. ముఖ్యంగా ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ–పాలిటీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల ప్రిపరేషన్ పరంగా ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది. ఇలా మిగిలిన సమయంలో తాము క్లిష్టంగా భావించే.. ఇతర ముఖ్య టాపిక్స్‌పై దృష్టిపెట్టొచ్చు. ముఖ్యాంశాల గుర్తింపు ప్రస్తుతం సమయంలో..అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ముఖ్యాంశాలను గుర్తించాలి. అందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో సబ్జెక్టుల వారీగా ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధా న్యం లభించిందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రలో.. సాంస్కృతిక చరిత్ర, రాజ్య వంశాలు వంటి వి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో గత ఏడాది కాలంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. ప్రధానంగా కరోనా పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై చూపిన ప్రభావం, వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు ముఖ్యమైనవిగా గుర్తించాలి. అదే విధంగా..ఆయా దేశాల మధ్య ఒప్పందాలు–వాటి ఉద్దేశం–అంతర్జాతీయంగా, జాతీయంగా వాటి ప్రభావం తదితర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. కొత్త అంశాలు చదవాలా విస్తృతమైన సివిల్స్ సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు కొన్ని టాపిక్స్‌ను వదిలేస్తుంటారు. అలా విస్మరించిన అంశాలను ఇప్పుడు చదవడం సరైందేనా.. అనే సందేహాన్ని చాలామంది అభ్య ర్థులు వ్యక్తం చేస్తుంటారు. గతంలో చదవకుండా వదిలేసిన టాపిక్స్‌లో కొరుకుడు పడని అంశాలుం టే.. అనవసర ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి విస్మరించిన అంశాలను ఇప్పుడు కొత్తగా చదవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పట్టు బిగించిన వాటినే మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ కొత్త అంశాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. కాన్సెప్ట్లపై అవగాహన పొందితే సరిపోతుంది. పేపర్–2కు కూడా సమయం అభ్యర్థులు పేపర్–2(సీశాట్)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అర్హత పేపర్‌గానే పేర్కొ న్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధి స్తేనే.. పేపర్–1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధా రంగానే మెయిన్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. రెండుసార్లు రివిజన్ సిలబస్ అంశాల ప్రిపరేషన్ సెప్టెంబర్ చివరికల్లా పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజూ కొంత సమయం రివిజన్‌కు కేటాయిస్తూ.. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేయాలి. రివిజన్‌కు ఉపకరించేలా ప్రిపరేషన్ సమయంలోనే ఎప్పటికప్పుడు షార్ట్‌నోట్స్ రాసుకోవాలి. మెమొరీ టిప్స్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్ సాధన చేయాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, అన్వయించుకోవడం వంటి వాటి ద్వారా మెమొరీ పెంచుకోవాలి. ఇలా ప్రతి విష యంలో నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. ప్రిలి మ్స్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. సబ్జెక్ట్ వారీగా ఇలా కరెంట్ అఫైర్స్: కరోనా పరిణామాలు, అభివృద్ధి కారకాలపై చూపుతున్న ప్రభావం; గత ఏడాది కాలంలో ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణాం కాలు; ముఖ్యమైన నియామకాలు; అంతర్జా తీయంగా పలు సంస్థల నివేదికల్లో భారత్‌కు సంబంధించిన గణాంకాలు. చరిత్ర: ఆధునిక భారత చరిత్ర; జాతీయోద్యమం; ప్రాచీన, మధ్యయుగ భారత చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చారిత్రక అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన–పరిపాలన విధానాలు; బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు–ఉద్యమాలు,సంస్కరణోద్యమాలు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటం. పాలిటీ: రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాం గ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు. రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి,గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు,అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వంటి వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు. పంచాయతీరాజ్ వ్యవస్థ: బల్వంత్రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రభుత్వ విధానాలు: విధానాల రూపకల్పన జరిగే తీరు; విధానాల అమలు, వాటి సమీక్ష; ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు; కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత. ఎకానమీ: ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు– మూలధన వనరుల పాత్ర. ► ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(ముఖ్యంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం వంటివి). ► ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి. ► పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం ► పంచవర్ష ప్రణాళికలు–ప్రణాళిక రచన–వనరుల కేటాయింపు–10, 11 పంచవర్ష ప్రణాళికలు ► బ్యాంకింగ్ రంగం ప్రగతి–సంస్కరణలు– ఇటీ వల కాలంలో బ్యాంకింగ్ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం; ► తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు. సైన్స్ అండ్ టెక్నాలజీ: గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంక్రమిస్తున్న వ్యాధులు–కారకాలు; సైబర్ సెక్యూరిటీ యాక్ట్; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు; ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు–పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు; వివిధ ఐటీ పాలసీలు. జాగ్రఫీ: జనగణనకు సంబంధించిన ముఖ్యాంశాలు; అత్యధిక, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు; అత్యధిక, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు; స్త్రీ, పురుష నిష్పత్తి; స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం; గత పదేళ్లలో జనన, మరణ రేట్లు. పర్యావరణ సమస్యలు– ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. ► సౌర వ్యవస్థ, భూమి అంతర్ నిర్మాణం, శిలలు, జియలాజికల్ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. ► మన దేశంలో నగరీకరణ; రుతుపవనాలు, నదులు; జలాల పంపిణీ; వివాదాలు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 ముఖ్యాంశాలు ► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 712 ► ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబర్ 10, 2021 ► రెండు పేపర్లు.. 400 మార్కులకు పరీక్ష (ఒక్కో పేపర్‌కు 200 మార్కులు). ► ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మలి దశ మెయిన్‌కు ఎంపిక ► తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు. -
ఐపీఎల్: ముందుగా యూఏఈకి చెన్నై జట్టు
చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13వ సీజన్‌కు అందరికంటే ముందుగా సమాయత్తమవుతుంది. ఈసారి ఐపీఎల్ దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.అందుకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్‌ను ఆగస్టు మొదటి వారంలోనే మొదలుపెట్టనుంది. ఆగస్టు 10నే యూఏఈకి వెళ్లేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ ఆటగాళ్లకు తెలియజేసింది. అయితే చెన్నై జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ముందుగా చెన్నైకు వచ్చి రిపోర్ట్ చేయనున్నట్లు సీఎస్కే యాజమాన్యం తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్రత్యేక చార్టర్ విమానంలో ఆటగాళ్లను దుబాయ్‌కు పంపనున్నట్లు తెలిపింది. కాగా కరోనా వైరస్‌కు ముందు ఐపీఎల్లో పాల్గొనేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అందరికంటే ముందే ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించింది. జట్టులో సీనియర్ ఆటగాళ్లైనా సురేశ్ రైనా, ఎంఎస్ ధోని , అంబటి రాయుడు తమ ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించారు. అయితే కరోనా వైరస్ విజృంభించడంతో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కాస్త వాయిదా పడింది. ఒక దశలో ఐపీఎల్ జరగుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. కానీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడడంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమయింది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్నారు. 53 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10వ తేదీన జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్‌ల వివరాలను ఆదివారం(ఆగస్టు 2) జరిగే ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ప్రకటించనున్నారు. దీంతో పాటు ఐపీఎల్ పాల్గొననున్న ఎనిమిది జట్లకు సంబంధించి ఎక్కడ ఉండాలనేదానిపై, లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఏ విధమైన భద్రత కల్పించాలనేదానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. -
యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా..
యూపీఎస్సీ ఇపీఎఫ్ఓ 2020 పరీక్ష కోసం సన్నద్ధమవుదామిలా.. యూపిఎస్సి ఇపిఎఫ్ఓ పరీక్షకు సన్నద్ధమవడానికి ముందు సిలబస్‌ను టాపిక్‌లుగా విడదీసుకోవడం అత్యంత ముఖ్యం. ఈ పరీక్ష అక్టోబర్‌లో జరుగుతుంది. కాబట్టి ఒక ప్రణాళిక వేసుకొని సంసిద్ధం అవడానికి తగిన సమయం ఉంది. ఉన్న సమయాన్ని సద్వినియోగించుకుంటూ పక్కా టైంటేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరే విజేతలవుతారు. యూపీఎస్సీ ఇపీఎఫ్ఓ 2020 పరీక్ష: లింక్ కోసం క్లిక్ చేయండి 1. భారత స్వాతంత్ర్యోద్యమ పోరాటం ఈ విభాగానికి సంబంధంచి 1857 సిపాయిల తిరుగుబాటు టాపిక్ నుంచి ప్రారంభించాలి. బిపిన్ చంద్ర రచించిన ఇండిపెండెన్స్ ఫర్ ఇండిపెండెన్స్ పుస్తకం ఉపయోగపడుతుంది . లేదా ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా (స్పెక్ట్రమ్) కూడా సరిపోతుంది. చారిత్రక సంఘటనలు, వాటిలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి గుర్తుంచుకోవాలి. దీనికోసం హైలెట్స్ పాయింట్స్‌ని కలరింగ్ చేసుకోవడం ద్వారా రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. 2. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇండియన్ పాలిటీపరీక్షలో చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉన్న టాపిక్ ఇది. భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, రాష్ర్టపతి, పార్లమెంట్ మొదలైన అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రాజ్యంగ సవరణలు, అధికారాలు లాంటి అంశాల గురించి దృష్టి పెట్టాలి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన సిలబస్‌ను కవర్ చేయడానికి ఎం. లక్ష్మీకాంత్ రాసిన పుస్తకాన్ని చదవండి. -ఎకానమీ ఎకానమీకి సంబంధించి ఎక్కువశాతం అనలైటికల్ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికవ్యవస్థకు సంబంధించి ఇప్పుడున్న స్థితిగతులను బాగా ఫాలో అవ్వాలి. యూనియన్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే , ఏఆర్సి వంటి ప్రభుత్వం ప్రచురించిన అన్ని సంబంధిత నివేదికలను చదవాల్సి ఉంటుంది. 11వ తరగతి ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, రమేష్ సింగ్ రాసిన ఇండియన్ ఎకానమీ వంటి పుస్తకాలను చదవొచ్చు. 3. కంప్యూటర్ అప్లికేషన్ ఈ విభాగానికి సంబంధించి 11, 12వ తరగతి కంప్యూటర్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ పుస్తకాలను తిరగేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్‌పై ఫోకస్ ఎక్కువగా చేస్తే సరిపోతుంది. 4. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక చట్టాలు ఈ విభాగంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసే వార్షిక నివేదికలు, ఇయర్ ఎండింగ్ రివ్యూ రిపోర్టులు, లేబర్ లా రిఫార్మ్స్, గవర్నెన్స్ రిఫార్మ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, లాంటి ఈపీఎఫ్‌వోలో చేర్చిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించండి. కార్మిక చట్టాలు, ఇండస్ర్టియల్ అంశాలకు సంబంధించిన ప్రస్తుత వార్తలను ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలి. దీనికి సంబంధించి కార్మిక శాఖ, పిఐబి ఇండియా యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి కూడా డాటా సేకరించి నోట్స్ రాసుకోవాలి. 5. జనరల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ టాపిక్‌లో ముఖ్యంగా బేసిక్స్‌పై దృష్టిపెట్టాలి. ఫార్ములాలు, ట్రిక్స్ తో ప్రాబ్లమ్స్‌ని ఎంత త్వరగా సాల్వ్ చొయోచ్చన్నది మీ ప్రాక్టిస్పైనే ఉంటుంది. ప్రతిరోజు టెస్ట్ పేపర్స్‌ని సాల్వ్ చేయాలి. గ్రేడ్ అప్ అనే ఆన్లైన్ యాప్‌ని డౌన్లోడ్ ద్వారా ఎక్స్పర్ట్స్ క్లాసెస్‌ని వినే సౌలభ్యం ఉంది. యూపీఎస్సీ ఇపిఎఫ్ఓ 2020 పరీక్షలో మంచి రిజల్ట్ రావాలంటే ప్రిపరేషన్‌ను ఇప్పటినుంచే ప్రారంభించండి. ప్రతీ టాపిక్‌పై ఎంతో కొంత నాలెడ్జ్ ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన పాయింట్లని నోట్‌డౌన్ చేసేకొని ఎప్పటికప్పుడు రివైజ్చేయండి. ఆల్ ది బెస్ట్ ... -
జీకే - కరెంట్ అఫైర్స్
కాంపిటీటివ్ గెడైన్స్ : కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్.. పోటీ పరీక్షల్లో రాణించాలంటే జనరల్ నాలెడ్‌జ, కరెంట్ అఫైర్స కీలకం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)తో మొదలుకొని ఎస్.ఎస్.సి., ఆర్ఆర్బీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స సంస్థలు, సబ్ ఇన్స్పెక్టర్స, పోలీస్ కానిస్టేబుల్స్, డీఎస్సీ.. ఇలా ప్రతి నియామక పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్స నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ విభాగాల్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి? ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే అంశాలు చదవాలో చూద్దాం. ఏ సబ్జెక్ట్‌కు అయినా నిర్దేశిత సిలబస్ ఉంటుంది. కానీ జీకే, కరెంట్ అఫైర్‌సకు మాత్రం ఎలాంటి సిలబస్ ఉండదు. ఏ అంశం నుంచైనా ప్రశ్నలు రావచ్చు. కరెంట్ అఫైర్‌సపై పట్టు సాధించాలంటే నిత్యం వార్తాపత్రికలను చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. తెలుగుతోపాటు ఒక ఆంగ్ల దినపత్రికను కూడా చదివితే కరెంట్ అఫైర్సతోపాటు ఆంగ్లంపై కూడా పట్టు సాధించవచ్చు. పత్రికలను ప్రధానంగా పరీక్షల దృష్టితో చదవాలి. బ్యాంకు పరీక్షలకైతే ఆర్నెళ్లు, యూపీఎస్సీ, రాష్ర్ట పోటీ పరీక్షలకైతే ఏడాది పాటు జరిగిన వర్తమాన అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళి, క్లిష్టతను పరిశీలించాలి. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. పూర్వాపరాలు తెలుసుకోండి కరెంట్ అఫైర్సను బిట్ల రూపంలో చదవద్దు. అలా చదివితే త్వరగా మరిచిపోయే ఆస్కారం ఉంది. ఒక అంశం గురించి చదివినప్పుడు దాని పూర్వాపరాలను కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు 2015కుగాను బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అంశాన్ని ఎలా ప్రిపేరవ్వాలో చూద్దాం.. ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలోని అత్యుత్తమ చలనచిత్ర రంగ అవార్డు. భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట 1969లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మనదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను 1913లో నిర్మించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, స్వర్ణకమలం, శాలువా బహూకరిస్తారు. ఈ అవార్డును తొలిసారిగా 1969లో దేవికారాణి రోరిచ్కు ప్రదానం చేశారు. ఇప్పటివరకు అయిదుగురు తెలుగు సినీ ప్రముఖులకు కూడా ఈ అవార్డును అందజేశారు. వారు.. బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (1974), ఎల్.వి.ప్రసాద్ (1982), బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), రామానాయుడు (2009). మనోజ్ కుమార్.. ఉప్కార్, క్రాంతి, పూరబ్ ఔర్ పశ్చిమ్ వంటి దేశభక్తి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి.’ ఇలా.. ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. ఈ విధంగా కరెంట్ అఫైర్సను స్టాక్ జీకేతో అనుసంధానం చేస్తూ చదివితే సులభంగా గుర్తుండి పోతుంది. బ్యాంక్ పరీక్షల కోసం.. బ్యాంక్ పీవో, క్లర్క, ఆర్బీఐ, నాబార్డ, ఇన్సూరెన్స సంస్థల పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలతోపాటు బ్యాంకింగ్ రంగం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారు బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాన్ని కూడా చదవాలి. రిజర్వ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, నూతన ప్రైవేట్ బ్యాంకులు (బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్), స్మాల్ ఫైనాన్స బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్‌ధన్ యోజన, పాలసీరేట్లు, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, బ్యాంకింగ్ పదజాలం, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, నాణేలు, ప్లాస్టిక్ కరెన్సీ, నాబార్డ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. జాతీయ అంశాలు దేశంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు, కమిషన్లు, ఎన్నికలు, రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య సంఘటనల్ని చదవాలి. తెలుగు రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు ప్రాంతీయ అంశాలను కూడా తెలుసుకోవాలి. అంతర్జాతీయ అంశాలు వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, అంతర్జాతీయ సదస్సులు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అంశాలను చదవాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ఇటీవల జరిగిన అంతరిక్ష, రక్షణ, పర్యావరణ, ఆరోగ్య, ఇంధన, సమాచార, సాంకేతిక రంగాల సంఘటనలను తెలుసుకోవాలి. ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఇటీవల పరీక్షించిన క్షిపణులు, ఆవిష్కరణలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, సంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ మిషన్ తదితర అంశాలను చదవాలి. ఆర్థిక అంశాలు కేంద్ర బడ్జెట్, ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాల గురించి చదవాలి. 2011 జనాభా లెక్కలను క్షుణ్నంగా పరిశీలించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల గురించి తెలుసుకోవాలి. క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాంశాలను చదవాలి. ఇటీవల జరిగిన ఆసియాకప్ క్రికెట్, అండర్-19 ప్రపంచకప్, టీ-20 క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్, దక్షిణాసియా క్రీడలు, కోపా అమెరికా ఫుట్‌బాల్, టెన్నిస్ ట్రోఫీలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్రీడాకారులు వారి దేశాలు, ట్రోఫీలు, క్రీడాపదజాలం తెలుసుకోవాలి. వార్తల్లోని వ్యక్తులు - అవార్డులు ఇటీవల చేపట్టిన నియామకాలు, ఎన్నిక, ఎంపిక, మరణాలు ముఖ్యమైనవి. జాతీయ అవార్డుల్లో.. పద్మ అవార్డులు, చలనచిత్ర పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, సాహిత్య అవార్డులు; అంతర్జాతీయ అవార్డుల్లో.. నోబెల్ బహుమతులు, రామన్ మెగసెసే పురస్కారాలు, ఆస్కార్ అవార్డులు, ప్రపంచ ఆహార బహుమతి, బుక్ ప్రైజ్ తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకే కోసం.. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు అవి ఉన్న ప్రదేశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్వలు, వ్యవసాయ విప్లవాలు, ప్రముఖ ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, ప్రముఖ దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, విటమిన్లు, వ్యాధులు, సౌరకుటుంబం, నదీతీరాన వెలసిన పట్టణాలు, ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు, ఐరాస ప్రకటించిన సంవత్సరాలు, దశాబ్దాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతులు, దేశాలు-రాజధానులు-కరెన్సీలు, పార్లమెంట్లు వంటి వాటిని చదవాల్సి ఉంటుంది. - ఎన్. విజయేందర్‌రెడ్డి కరెంట్ అఫైర్స నిపుణులు,హైదరాబాద్ -
విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ సోపానం..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆకర్షణీయ వేతనాలతో పాటు సమాజంలో గౌరవం కూడా లభించే ఉపాధ్యాయ కొలువును చేజిక్కించుకోవాలంటే టెట్‌తో పాటు డీఎస్సీలో మంచి స్కోర్ సాధించాల్సిందే! ఈ నేపథ్యంలో టెట్‌తో పాటు డీఎస్సీ ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్.. మెథడాలజీ: ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్-1, పేపర్-2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహారణ: హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సాధారణీకరణం తర్వాత సోపానం ఏది? 1) సంసర్గం 2) పునర్విమర్శ 3) విషయ విశదీకరణం 4) అన్వయం జవాబు: 4 ఉదాహారణ :‘విద్యార్థి దేన్నీ అసంపూర్తిగా వదిలేయడు’ అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? 1) ఆత్మవిశ్వాసం 2) అనుకూల వైఖరి 3) అభినందన 4) శాస్త్రీయ వైఖరి జవాబు : 1 కంటెంట్ -సోషల్ స్టడీస్: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా పౌరనీతి శాస్త్రం, అర్థ శాస్త్రం చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతో సరిపోల్చుతూ, జరుగుతున్న పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. సైన్స: పేపర్-1 కోసం కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. పేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు క్లిష్టంగానే ఉన్నాయి. చదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం ఉత్తమం. మ్యాథమెటిక్స్: అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్సీఈఆర్టీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. గణితం మెథడాలజీ విషయంలో డీఎస్సీ తరహాలోనే ప్రిపరేషన్ సాగిస్తే ఎక్కువ ఉపయోగం. మ్యాథ్స్‌కు తెలుగు అకాడెమీ పుస్తకాలు, ఆబ్జెక్టివ్ మెటీరియల్ చదవాలి. లాంగ్వేజ్‌లు: లాంగ్వేజ్ 1, లాగ్వేజ్ 2లో భాషావిభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనపద్ధతులు గురించి ఉంటుంది. పాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్: పేపర్-1, పేపర్-2లలో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రశ్నలు అడుగుతారు. గతంలో నిర్వహించిన టెట్‌లో వ్యాకరణానికి సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ ప్రశ్నలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్; ఆర్టికల్స్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచ్; డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ ఇలా అన్ని అంశాలపైనా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రిఫరెన్స్ బుక్స్: కంటెంట్: పేపర్-1: 1-5వ తరగతి టెక్ట్స్ బుక్స్ పేపర్-2: 6-8వ తరగతి టెక్ట్స్ బుక్స్ మెథడాలజీ కోసం-తెలుగు అకాడమీ పుస్తకాలు విద్యా మనో విజ్ఞాన శాస్త్రం- డీఈడీ, బీఈడీ పుస్తకాలు. ఏపీ టెట్ శిశు వికాసం, పెడగాజి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు.. అభ్యర్థులు డీఎడ్, బీఎడ్ స్థాయిలో సైకాలజీలో చదువుకున్నవే. వీటితో పాటు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు: ఛోమ్‌స్కీ, కార్ల్‌రోజర్స్ వికాస సిద్ధాంతాలు. వైగాట్స్కీ అభ్యసన సిద్ధాంతం బోధన దశలు. ఉపాధ్యాయ నైపుణ్యాలు. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం, విద్యా హక్కు చట్టం. ఉదాహారణ: ‘స్కిమాట’ అనేది? 1) ప్రవర్తనా నమూనా లేదా సంజ్ఞానాత్మక నిర్మితి 2) భాషా వికాసం వల్ల ఏర్పడేది 3) అనర్గళంగా సంభాషించడం 4) ఒకరకమైన భాషా దోషం జవాబు: 1 ఉదాహారణ: మానవులను ధనాత్మక సంపదగా పేర్కొన్నది? 1) కొఠారి కమిషన్ 2) మొదలియార్ కమిషన్ 3) నూతన విద్యా విధానం-1968 4) నూతన విద్యా విధానం- 1986 జవాబు: 4 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్సీటీఈ నిబంధనల మేరకు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత సాధించాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహిస్తోంది. గత ఆగస్టు 25న మరోసారి టెట్ నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసినా, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో టెట్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. డీఈడీ, బీఈడీ, భాషా పండిత శిక్షణ, తత్సమాన అర్హత ఉన్న వారందరూ టెట్ రాయొచ్చు. ఎస్జీటీ అభ్యర్థులు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ ఔత్సాహికులు పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది. వెయిటేజ్: డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. టెట్‌లో సాధించే ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుంది. అందువల్ల డీఎస్సీలో సక్సెస్‌కు టెట్ కీలకం. సిలబస్: శిశు వికాసం, పెడగాజి: ప్రస్తుతం అభ్యర్థులు ప్రధానంగా శిశువు ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, వైయక్తిక భేదాలు, వాటిలో కనిపించే నిర్దిష్ట అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వం అంశాలను ఒకటికి రెండుసార్లు చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. మనో వైజ్ఞానిక శాస్త్రం (సైకాలజీ) అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం -మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్) లను గురించి అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు? అనే వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి. టెట్ విద్యార్థికి, ఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ.. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే భావించకూడదు. అది ఒక పోటీ పరీక్ష. ఎందుకంటే అభ్యర్థులు టెట్‌లో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో రెండు మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు సైకాలజీ, తెలుగు, ఇంగ్లిష్, కంటెంట్, మెథడాలజీలపై పట్టుసాధించాలి. సైకాలజీలోని భావనలు, సిద్ధాంతాలు, నియమాలను బట్టీ పద్ధతిలో కాకుండా, తార్కికంగా విశ్లేషించుకొని చదవాలి. సైకాలజీలోని అంశాలను విద్యార్థి, ఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ అభ్యసించాలి. ఇంగ్లిష్, తెలుగు విభాగంలో అభ్యర్థులు వ్యాకరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ప్రస్తుతం ముఖ్యమైన అంశాలను చదవడానికే సమయాన్ని కేటాయించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఇంగ్లిష్, తెలుగు, పెడగాజి విభాగాన్ని అధ్యయనం చేయాలి. కంటెంట్ విభాగంలో పేపర్-1 రాసే అభ్యర్థులు.. 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేయాలి. పేపర్-2 రాసే అభ్యర్థులు 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలకాంశాలను చదవాలి. కంటెంట్‌కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి టెట్‌లో క్లిష్టమైన విభాగం మెథడాలజీ. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే లక్ష్యాలు, స్పష్టీకరణాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరిక్యులం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. ప్రస్తుతం అభ్యర్థులు వీలైనన్ని మోడల్ పేపర్లను సేకరించి, సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. అప్పుడు ఆయా అంశాలకు ఎక్కువ సమాయాన్ని కేటాయించొచ్చు. డీఎస్సీ విద్యా దృక్పథాలపై అవగాహన అవసరం టెట్‌తో పోల్చుకుంటే డీఎస్సీకి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇటు టెట్‌తో పాటు డీఎస్సీకి ఉపయోగపడే కంటెంట్, మెథడాలజీ అంశాలను ఏకకాలంలో ప్రిపేర్ కావాలి. నూతన విద్యా దృక్పథాలపై అభ్యర్థులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి. ఇందులోని చారిత్రక, మనోవైజ్ఞానిక, తాత్విక, సామాజిక అంశాలను చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. జనరల్ నాలెడ్జ్ విభాగం విస్తారమైంది. ఖండాలు, వాటిలోని దేశాలు, ఆ దేశాలకు సంబంధించిన భౌగోళిక, చారిత్రక అంశాలను చదవాలి. అభ్యర్థులు ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలను వర్తమాన వ్యవహారాలకు అన్వయించుకొని చదవాలి. కంటెంట్ విభాగానికి సంబంధించి ఎస్జీటీ అభ్యర్థులు 6 నుంచి పదో తరగతి స్థాయి వరకు అధ్యయనం చేయాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ స్థాయి వరకు చదవాలి. డీఎస్సీ ప్రిపరేషన్: ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) రెండు విభాగాలకు ఉమ్మడిగా ఉండే సబ్జెక్ట్‌లు కంటెంట్, టీచింగ్ మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే. ఎస్జీటీకి అదనంగా లాంగ్వేజెస్ ఉంటాయి. కంటెంట్, మెథడాలజీ సబ్జెక్టులను టెట్ కోసం చదువుతారు కాబట్టి ఇది డీఎస్సీ ప్రిపరేషన్‌కు కొంత వరకూ ఉపయోగపడుతుంది. టెట్ సిలబస్‌తో పోల్చితే డీఎస్సీ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి సమయపాలనను అలవరచుకొని, ప్రణాళిక ప్రకారం చదవాలి. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ప్రధానం. ఎస్జీటీ కంటెంట్‌కు సంబంధించి ఏదైనా ఒక అంశం ఎనిమిదో తరగతి వరకు ఉండి, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే అలాంటి అంశాలను చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్‌కు సంబంధించి హైస్కూల్ స్థాయి వరకు ఉండి, ఇంటర్మీడియెట్ పుస్తకాల్లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. లాంగ్వేజెస్: ఎస్జీటీ విభాగంలో మాత్రమే లాంగ్వేజెస్ ఉంటాయి. ఆయా భాషల్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. తెలుగుకు సంబంధించి కవులు- రచయితలు- వారి రచనలు, భాషారూపాలు తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సెంటెన్సెస్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచెస్; వొకాబ్యులరీ వంటి అంశాలపై పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టెట్‌లో లాంగ్వేజెస్ కోసం సాగించిన ప్రిపరేషన్ డీఎస్సీకి సరిపోతుంది. మెథడాలజీ: ఇందులో ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి. దీనిలో బోధనా లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. మెథడాలజీ అంశాలను కంటెంట్‌లోని పాఠ్యాంశాలకు అన్వయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. భావనలను తరగతి, ఉపాధ్యాయుడు, విద్యార్థికి అనుప్రయుక్తం చేసుకుని అధ్యయనం చేయాలి. బోధన పద్ధతులను చదివేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ సబ్జెక్టుకు ఏ బోధనా పద్ధతి సరిపోతుందో విశ్లేషించుకుని చదవాలి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్: పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో విద్య, ఉపాధ్యాయుడు చారిత్రక నేపథ్యం, వేద విద్య, జైనుల, ముస్లిం, బ్రిటిష్ విద్యా విధానాలతోపాటు స్వాతంత్య్రానంతర ఉన్నత కమిషన్ల గురించి చదవాలి. ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించే అంశాలు, ఉపాధ్యాయుల వృత్తి పూర్వక, వృత్యంతర శిక్షణ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వాటి విధులు, రికార్డులు, రిజిస్టర్లకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి. అర్థశాస్త్రం- విద్య, జనాభావిద్య, ప్రజాస్వామ్య విద్య, పర్యావరణ విద్య, కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించిన అంశాలను చదవాలి. జాతీయ విద్యా ప్రణాళిక, విద్యా హక్కు చట్టం గురించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఎస్జీటీ/ఎస్‌ఏలకు ఒకే రకమైన సిలబస్ ఉన్నప్పటికీ.. ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది. స్థూలంగా చూస్తే ఐదు విభాగాలుగానే కనిపిస్తున్నప్పటికీ.. అందులోని అంశాలను చూసినప్పుడు విస్తృత ప్రిపరేషన్ అవసరం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్స్, సమ్మిళిత విద్య, పర్యావరణ విద్య, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఉచిత నిర్భంద విద్య, బాలల హక్కులు, మానవ హక్కులు, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్- 2005.. ఇలా చాలా అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: కరెంట్ అఫైర్స్‌లో వర్తమాన, శాస్త్ర సాంకేతిక అంశాలు, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటు చేసుకున్న పరిణామాలు, వార్తల్లోని వ్యక్తులు, సమావేశాలు, క్రీడలు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. జీకే కోసం.. చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు-తెగలు-సంస్కృతులు, రాజధానులు, కరెన్సీ, తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఉదాహారణ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఎక్కడ ఉంది? జవాబు : కోల్‌కతా ఉదాహారణ : ఆస్ట్రేలియా 28వ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసింది ఎవరు? జవాబు : టోనీ అబోట్ (లిబరల్ పార్టీ) ప్రిపరేషన్ ప్రణాళిక: మన విద్యా విధానంలో పాఠ్యాంశాలను రూపొందించేటప్పుడు ఏకకేంద్ర విధానాన్నే పాటిస్తున్నారు. ఒక పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలను కింది తరగతుల్లో పొందుపరిచి.. ఎగువ తరగతులకు వెళ్లే కొద్దీ వాటి క్లిష్టత స్థాయిని పెంచుతూ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. కాబట్టి కంటెంట్ చదివేటప్పుడు కింది తరగతుల పుస్తకాలను చదవడం ప్రారంభిస్తే.. ఎగువ తరగతుల్లో పునరావృతమయ్యే అంశాలపై పట్టు చిక్కుతుంది. అభ్యర్థులు ప్రతి పాఠ్యాంశానికి చివర్లో ఇచ్చిన ముఖ్యాంశాలను, బిట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. డీఎస్సీలో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికతో చదవాలి. కటెంట్‌కు 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదివి సొంతంగా నోట్సు ప్రిపేర్ చేసుకుంటే మంచిది. మెథడాలజీకి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదివితేనే మంచి స్కోర్‌కు అవకాశముంటుంది. రిఫరెన్స్ బుక్స్: ఎస్జీటీ: కంటెంట్: 1-10వ తరగతి టెక్ట్స్ బుక్స్ ఇంగ్లిష్ గ్రామర్: రెన్ అండ్ మార్టిన్, మార్కెట్లో లభించే ఏదైనా ప్రామాణిక పుస్తకం. మెథడాలజీ: తెలుగు అకాడమీ పుస్తకాలు ఎస్ఏ: కంటెంట్: 6-10వ తరగతి పుస్తకాలు, ఇంటర్మీడియెట్ తెలుగు అకాడమీ పుస్తకాలు జీకే: మనోరమ ఇయర్ బుక్, తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు. టిప్స్: వివిధ అంశాలను చదువుతున్నప్పుడు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్న వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పడుతుంది. అధ్యాయాల వారీగా ప్రాక్టీస్ టెస్ట్ రాయడం వల్ల ప్రిపరేషన్లో లోటుపాట్లు తెలుస్తాయి.