యూపీఎస్సీ ఇపీఎఫ్ఓ 2020 పరీక్ష కోసం సన్నద్ధమవుదామిలా..
యూపిఎస్సి ఇపిఎఫ్ఓ పరీక్షకు సన్నద్ధమవడానికి ముందు సిలబస్‌ను టాపిక్‌లుగా విడదీసుకోవడం అత్యంత ముఖ్యం. ఈ పరీక్ష అక్టోబర్‌లో జరుగుతుంది. కాబట్టి ఒక ప్రణాళిక వేసుకొని సంసిద్ధం అవడానికి తగిన సమయం ఉంది. ఉన్న సమయాన్ని సద్వినియోగించుకుంటూ పక్కా టైంటేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరే విజేతలవుతారు.
యూపీఎస్సీ ఇపీఎఫ్ఓ 2020 పరీక్ష: లింక్ కోసం క్లిక్ చేయండి
1. భారత స్వాతంత్ర్యోద్యమ పోరాటం
ఈ విభాగానికి సంబంధంచి 1857 సిపాయిల తిరుగుబాటు టాపిక్ నుంచి ప్రారంభించాలి. బిపిన్ చంద్ర రచించిన ఇండిపెండెన్స్ ఫర్ ఇండిపెండెన్స్ పుస్తకం ఉపయోగపడుతుంది . లేదా ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా (స్పెక్ట్రమ్) కూడా సరిపోతుంది. చారిత్రక సంఘటనలు, వాటిలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి గుర్తుంచుకోవాలి. దీనికోసం హైలెట్స్ పాయింట్స్‌ని కలరింగ్ చేసుకోవడం ద్వారా రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది.
2. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ
ఇండియన్ పాలిటీపరీక్షలో చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉన్న టాపిక్ ఇది. భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, రాష్ర్టపతి, పార్లమెంట్ మొదలైన అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రాజ్యంగ సవరణలు, అధికారాలు లాంటి అంశాల గురించి దృష్టి పెట్టాలి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన సిలబస్‌ను కవర్ చేయడానికి ఎం. లక్ష్మీకాంత్ రాసిన పుస్తకాన్ని చదవండి.
-ఎకానమీ
ఎకానమీకి సంబంధించి ఎక్కువశాతం అనలైటికల్ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికవ్యవస్థకు సంబంధించి ఇప్పుడున్న స్థితిగతులను బాగా ఫాలో అవ్వాలి. యూనియన్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే , ఏఆర్సి వంటి ప్రభుత్వం ప్రచురించిన అన్ని సంబంధిత నివేదికలను చదవాల్సి ఉంటుంది. 11వ తరగతి ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్, రమేష్ సింగ్ రాసిన ఇండియన్ ఎకానమీ వంటి పుస్తకాలను చదవొచ్చు.
3. కంప్యూటర్ అప్లికేషన్
ఈ విభాగానికి సంబంధించి 11, 12వ తరగతి కంప్యూటర్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ పుస్తకాలను తిరగేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్‌పై ఫోకస్ ఎక్కువగా చేస్తే సరిపోతుంది.
4. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక చట్టాలు
ఈ విభాగంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసే వార్షిక నివేదికలు, ఇయర్ ఎండింగ్ రివ్యూ రిపోర్టులు, లేబర్ లా రిఫార్మ్స్, గవర్నెన్స్ రిఫార్మ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, లాంటి ఈపీఎఫ్‌వోలో చేర్చిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించండి. కార్మిక చట్టాలు, ఇండస్ర్టియల్ అంశాలకు సంబంధించిన ప్రస్తుత వార్తలను ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలి. దీనికి సంబంధించి కార్మిక శాఖ, పిఐబి ఇండియా యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుంచి కూడా డాటా సేకరించి నోట్స్ రాసుకోవాలి.
5. జనరల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ టాపిక్‌లో ముఖ్యంగా బేసిక్స్‌పై దృష్టిపెట్టాలి. ఫార్ములాలు, ట్రిక్స్ తో ప్రాబ్లమ్స్‌ని ఎంత త్వరగా సాల్వ్ చొయోచ్చన్నది మీ ప్రాక్టిస్‌పైనే ఉంటుంది. ప్రతిరోజు టెస్ట్ పేపర్స్‌ని సాల్వ్ చేయాలి. గ్రేడ్ అప్ అనే ఆన్‌లైన్ యాప్‌ని డౌన్‌లోడ్ ద్వారా ఎక్స్‌పర్ట్స్ క్లాసెస్‌ని వినే సౌలభ్యం ఉంది. యూపీఎస్సీ ఇపిఎఫ్ఓ 2020 పరీక్షలో మంచి రిజల్ట్ రావాలంటే ప్రిపరేషన్‌ను ఇప్పటినుంచే ప్రారంభించండి. ప్రతీ టాపిక్‌పై ఎంతో కొంత నాలెడ్జ్ ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన పాయింట్లని నోట్‌డౌన్ చేసేకొని ఎప్పటికప్పుడు రివైజ్‌చేయండి.
ఆల్ ది బెస్ట్ ...
Comments
Please login to add a commentAdd a comment