న్యూఢిల్లీ: ఈ సంవత్సరం(2020) సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న జమ్మూకశ్మీర్ యువతకు గరిష్ట వయోపరిమితి విషయంలో మినహాయింపు ఇవ్వడం లేదు. గత సంవత్సరం 1980–89 మధ్య అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత నివాసులైన సివిల్స్ అభ్యర్థులకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని 32 ఏళ్ల నుంచి ఐదేళ్ల పాటు పెంచారు. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆ సడలింపును ఎత్తేశారు.
796 ఖాళీలతో 2020 సంవత్సర సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్‌ను బుధవారం యూపీఎస్సీ జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఐదేళ్లు, ఇతర వెనకబడిన వర్గాల వారికి మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 3 ఆఖరి తేది. పరీక్షకు మూడు వారాలు ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment