కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్,ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్–సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో మొత్తం 159 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. సీఏపీఎఫ్–2021కు అర్హతలు.. ఎంపిక విధానం వివరాలు..
► పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్
► మొత్తం పోస్టుల సంఖ్య: 159
► పోస్టుల వివరాలు: బీఎస్‌ఎఫ్–35, సీఆర్‌పీఎఫ్–36,సీఐఎస్‌ఎఫ్–67,ఐటీబీపీ 20,ఎస్‌ఎస్‌బీ–01
అర్హత
బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన అర్హత ఉండాలి. 2021లో డిగ్రీ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. సీఏపీఎఫ్–2021 పరీక్షకు అవసరమైన నిర్దిష్ట శారీరక, ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 20–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1996 –01.08.2001 మధ్య జన్మించి ఉండాలి. ∙ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/మెడికల్ స్టాండర్ట్ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష విధానం
► రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇవి రెండూ ఒకే రోజు నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
► పేపర్1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్‌పై–250 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
► పేపర్ 2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది.
► రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)
ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టుకు పిలుస్తారు. ఇది 150 మార్కులకు జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 05.05.2021
► పరీక్ష తేది: 08.08.2021
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
► వెబ్‌సైట్: https://www.upsc.gov.in
Comments
Please login to add a commentAdd a comment