CAPF
-
ప్రాంతీయభాషల్లోనూ సీఏపీఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్వీట్ చేశారు. ‘‘మన దేశ యువత ఆకాంక్షలు నెరవేరేలా ఈ నిర్ణయం ఉంది. ఎవరైనా తాము కన్న కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకిగా మారకూడదన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం.’’ అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోకి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) వస్తాయి. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. -
డిగ్రీ పూర్తి చేశారా.. మీకోసమే.. 4,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. అయితే మీకు మరో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! సాయుధ దళాలు, ఢిల్లీ పోలీస్ విభాగంలో.. సబ్ ఇన్స్పెక్టర్ కొలువు మీ ముంగిట నిలిచింది! కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ .. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. తాజాగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్–కేంద్ర సాయుధ పోలీస్ దళాలు) లో.. సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్ఎస్సీ తాజా నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ ఉద్యోగార్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరు డిగ్రీ నుంచే తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంటారు. అలాంటి వారికి ఎస్ఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ మరో చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎస్ఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్‌తోపాటు సీఏపీఎఫ్లో మొత్తం 4,300 ఎస్ఐ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సీఏపీఎఫ్లో 3960 పోస్టులు ఉండగా.. ఢిల్లీ పోలీసు విభాగంలో 340 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ►విద్యార్హత: ఆగస్ట్ 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ►వయసు: జనవరి 1, 2022 నాటికి 20–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. ►వేతన శ్రేణి: రూ.35,400–రూ.1,12,400 శారీరక ప్రమాణాలు ►ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితో΄ాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ►పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా పురుష అభ్యర్థులకు నిర్దేశిత ఛాతీ కొలతలు తప్పనిసరి. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ సబ్–ఇన్స్పెక్టర్ పోస్ట్‌ల భర్తీకి ఎస్ఎస్సీ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ముందుగా పేపర్–1 పేరుతో రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పేరిట దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం పేపర్–2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు. పేపర్–1 ఇలా తొలి దశగా నిర్వహించే పేపర్–1ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రెండో దశ ఫిజికల్ ఎండ్యూరెన్స్ పేపర్–1లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన వారితో మెరిట్ జాబితా రూ΄÷ందిస్తారు. వీరికి రెండో దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పలు ఫిజికల్ ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అవి.. వంద మీటర్లు, 1.6 కిలో మీటర్ల పరుగు పందెం; లాంగ్ జంప్, హై జంప్; షాట్‌పుట్. వంద మీటర్ల పరుగును 16సెకన్లలో, 1.6కిలో మీటర్ల పరుగును 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 3.65 మీటర్ల దూరంతో లాంగ్ జంప్ చేయాలి. 1.2 మీటర్ల ఎత్తులో హై జంప్ చేయాలి. 16 ఎల్బీస్ బరువును 4.5 మీటర్ల దూరం విసరాలి. హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్లకు సంబంధించి గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. మహిళా అభ్యర్థులకు ఈవెంట్లు ఇలా వంద మీటర్ల పరుగును 18 సెకన్లలో; 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో; 2.7 మీటర్ల లాంగ్ జంప్, 0.9 మీటర్ల హై జంప్ ఈవెంట్లు ఉంటాయి. వీరికి కూడా లాంగ్ జంప్, హై జంప్ ఈవెంట్లలో గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. అదే విధంగా వీరికి షాట్ పుట్ నుంచి మినహాయింపు ఉంటుంది. 200 మార్కులకు పేపర్–2 ►ఫిజికల్ ఈవెంట్లలో విజయం సాధించిన వారికి తదుపరి దశలో పేపర్–2 ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనే ఒకే విభాగంలో 200 ప్రశ్నలు–200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ►పేపర్–1, పేపర్–2 రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ నిబంధన విధించారు. ►ఆన్లైన్ విధానంలో నిర్వహించే రెండు పేపర్లలోనూ పొందిన మార్కులను నార్మలైజేషన్ విధానంలో క్రోడీకరించి.. నిర్దిష్ట కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితా రూపొందిస్తారు. పరీక్షలో విజయానికి పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఎక్కువగా దేహ దారుఢ్యంపైనే కసరత్తు చేస్తుంటారు. కాని రాత పరీక్షలో విజయం కూడా ఎంతో కీలకంగా నిలుస్తోంది. జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. భారత దేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్–డీకోడింగ్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్ మ్యాథ్స్‌తో΄ాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేపర్–1లో మాత్రమే ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో రాణించడానికి అభ్యర్థులు.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్–స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్లను ప్రాక్టీస్ చేయాలి. 200 మార్కులతో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేరుతో నిర్వహించే పేపర్–2లో రాణించడానికి అభ్యర్థులు.. ఫ్రేజెస్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రెసిస్ రైటింగ్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి. కమాండెంట్ స్థాయికి సబ్–ఇన్స్పెక్టర్గా కొలువు దీరిన వారు సర్వీస్ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా కమాండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత అసిస్టెంట్ కమాండెంట్‌గా, అనంతరం డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ►దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 30,2022 ►ఆన్లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: సెప్టెంబర్ 1 ►ఆన్లైన్ పరీక్ష తేదీ: నవంబర్‌లో ►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ►పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in -
CAPF AC 2021P: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్!
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్(సీఏపీఎఫ్–ఏసీ).. ధైర్య సాహసాలతోపాటు దేశ సేవ చేయాలనే తపన ఉన్న యువతకు చక్కటి మార్గంగా నిలుస్తోంది. కేంద్ర సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ నియామకాలకు సంబంధించి.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. సీఏపీఎఫ్(ఏసీ)– 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సీఏపీఎఫ్ పరీక్ష వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం.. సీఏపీఎఫ్(ఏసీ)... కేంద్ర సాయుధ రక్షణ దళాలైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), ఇండో–టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) విభాగాల్లో అసి స్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. తాజాగా 2021కు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య–159 సీఏపీఎఫ్ (ఏసీ) ఎగ్జామ్.. ద్వారా మొత్తం అయిదు విభాగాల్లో 159 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. బీఎస్ఎఫ్–35; సీఆర్పీఎఫ్–36, సీఐఎస్ఎఫ్–67, ఐటీబీపీ–20, ఎస్ఎస్బీ–01. ఐటీబీపీకి సంబంధించి 20 ఖాళీల్లో 13 ఖాళీలు బ్యాక్లాగ్ ఖాళీలుగా యూపీఎస్సీ పేర్కొంది. అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: ఆగస్ట్ 1, 2021 నాటికి 20 నుంచి 25ఏళ్ల మధ్యలో ఉండాలి(ఆగస్ట్ 2, 1996–ఆగస్ట్ 1, 2001 మధ్యలో జన్మించి ఉండాలి). ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తమ సర్వీస్ ప్రిఫరెన్స్‌ను తెలియజేయాలి. మహిళా అభ్యర్థులకు ఐటీబీపీకి అర్హత లేదు. ఎంపిక ప్రక్రియ.. మూడు దశలు సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. అవి..రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ. మొదటి దశ.. రాత పరీక్ష ఎంపిక ప్రక్రియ మొదటి దశలో రాత పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్కులకు; పేపర్–2 జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–1కు రెండు గంటలు, పేపర్–2కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్–1 ఆబ్జెక్టివ్ విధానం జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ పేపర్లో.. సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నల్లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం–జీవ వైవిధ్యం, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్లో మంచి మార్కు లు సాధించాలంటే.. ముందుగా సిలబస్‌లో పేర్కొన్న టాపిక్స్‌కు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని అంశాల బేసిక్స్, ఫార్ములాలపై అవగాహన ఏర్పడుతుంది. కరెంట్ అఫైర్స్ కోసం ఆర్థిక–రాజకీయ పరిణా మాలపై దృష్టిసారించడం ఉపకరిస్తుంది. దీంతోపాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం–ముఖ్య ఘట్టాలు–వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ–భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పొందడం మరింత మేలు చేస్తుంది. పేపర్–2 భావ వ్యక్తీకరణ ► జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ అంశాల్లో నిర్వహించే పేపర్–2 రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎలో ఎస్సే కొశ్చన్స్ అడుగుతారు. ఈ ఎస్సే రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్–ఎకు 80 మార్కులు కేటాయించారు. ► పార్ట్–బిలో 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రెసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి. రెండో దశ–ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పేపర్–1, పేపర్–2లలో నిర్ణీత కటాఫ్ మార్కులు సొంతం చేసుకున్న అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నాలుగు విభాగాల్లో(వంద మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్) ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. ఇందులో పురుషులు, మహిళలకు వేర్వేరు సమయాలు ఉంటాయి. అవి.. ► లాంగ్‌జంప్ విభాగంలో గరిష్టంగా మూడుసార్లు పోటీ పడే అవకాశం ఉంటుంది. షాట్‌పుట్ నుంచి మహిళలకు మినహాయింపు ఉంది. ► ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలపై శిక్షణ పొందాలి. ఈ ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ మొదటి రెండు దశల్లోనూ రాణించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారిని చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీనికి 150 మార్కులు కేటాయిం చారు. ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థుల్లో సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించగలిగే సామర్థ్యాలు, దృక్పథాన్ని పరీక్షిస్తారు. సర్వీసులు.. శిక్షణ మూడు దశల ఎంపిక ప్రక్రియలో రాణించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు పొందిన ర్యాంకు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఆధారంగా శాఖను కేటాయిస్తారు. తర్వాత దశలో సుమారు ఏడాదిపాటు ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. అది కూడా పూర్తి చేసుకుంటే.. గ్రూప్–ఎ గెజిటెడ్ హోదాలో అసిస్టెంట్ కమాండెంట్‌గా విధుల్లో చేరొచ్చు. సీఏపీఎఫ్ ఏసీ నుంచి డీజీ స్థాయి వరకు సీఏపీఎఫ్ ఏసీ ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ కమాండెంట్‌గా కొలువులు సొంతం చేసుకున్న వారు.. భవిష్యత్తులో పదోన్నతుల కోణంలో ఆయా దళాల్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ లేదా అంతకంటే ఉన్నతమైన ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయికి చేరుకోవచ్చు. కెరీర్లో అత్యంత ప్రతిభ చూపిన వారు ఆయా దళాల్లో అత్యున్నతమైన అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. అసిస్టెంట్ కమాండెంట్ కెరీర్.. ఇలా ► ఆరేళ్ల సర్వీసు తర్వాత డిప్యూటీ కమాండెంట్‌గా పదోన్నతి. ► ఆరు నుంచి 12 ఏళ్ల సర్వీసుతో రెండో ఇంచార్జ్ కమాండెంట్‌గా పదోన్నతి. ► 16 నుంచి 20 ఏళ్ల సర్వీసుతో కమాండెంట్ హోదా. ► 20 నుంచి 23 ఏళ్ల సర్వీసుతో డీఐజీగా పదోన్నతి. ► 23 నుంచి 26 ఏళ్ల సర్వీసుతో ఐజీ హోదా. ► కెరీర్లో అత్యంత ప్రతిభా పాటవాలు చూపితే అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాను కూడా సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్ టిప్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, రైటింగ్ ప్రాక్టీస్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు పెంచుకోవాలి. అలాగే ప్రిపరేషన్ పూర్తి చేశాక.. ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవడం పరీక్షకు ముందు రివిజన్‌కు ఉపయోగపడుతుంది. అలాగే మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా పరీక్షలో విజయానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. సీఏపీఎఫ్ (ఏసీ)–2021 ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 5, 2021. ► దరఖాస్తుల ఉపసంహరణ అవకాశం: మే 12 నుంచి మే 18 వరకు. ► సీఏపీఎఫ్ రాత పరీక్ష తేదీ: ఆగస్ట్ 8, 2021. ► తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.upsc.gov.in ► ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్సైట్: upsconline.nic.in -
UPSC CAPF: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్,ఐటీబీపీ, ఎస్ఎస్బీల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్–సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో మొత్తం 159 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. సీఏపీఎఫ్–2021కు అర్హతలు.. ఎంపిక విధానం వివరాలు.. ► పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 159 ► పోస్టుల వివరాలు: బీఎస్ఎఫ్–35, సీఆర్పీఎఫ్–36,సీఐఎస్ఎఫ్–67,ఐటీబీపీ 20,ఎస్ఎస్బీ–01 అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన అర్హత ఉండాలి. 2021లో డిగ్రీ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. సీఏపీఎఫ్–2021 పరీక్షకు అవసరమైన నిర్దిష్ట శారీరక, ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు: 01.08.2021 నాటికి 20–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1996 –01.08.2001 మధ్య జన్మించి ఉండాలి. ∙ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/మెడికల్ స్టాండర్ట్ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష విధానం ► రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇవి రెండూ ఒకే రోజు నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ► పేపర్1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్‌పై–250 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది. ► పేపర్ 2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. ► రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్) ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టుకు పిలుస్తారు. ఇది 150 మార్కులకు జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 05.05.2021 ► పరీక్ష తేది: 08.08.2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://www.upsc.gov.in -
విషాదం: పోలింగ్ కేంద్రంలో జవాన్ ఆత్మహత్య
కోల్కత్తా: ఎన్నికలకు అంతా సిద్ధమైంది.. కొద్దిసేపయితే పోలింగ్ ప్రారంభం అవ్వాల్సిన సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ జవాన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికలకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో రెండో దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని పాతర్ ప్రతిమ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఆ కేంద్రంలో బందోబస్తు నిర్వహించేందుకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన కమల్‌గంగూలీ బుధవారం వచ్చాడు. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఒకవైపు ఎన్నికలు ఉన్నాయి.. ఇక్కడేమో మృతదేహం అని కంగారు పడ్డారు. వెంటనే మృతదేహాన్ని దించి పోస్టుమార్టం తరలించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో మొత్తం సర్దుబాటు చేసి ఏర్పాట్లు పునరుద్ధరించారు. అయితే జవాన్ గంగూలీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పారామిలిటరీ(సీఏపీఎఫ్) క్యాంటీన్లలో ఇక నుంచి కేవలం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ ఆదేశాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇకపై సీఏపీఎఫ్ క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు మాత్రమే లభించనున్నాయి. నిన్న(మంగళవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరూ స్థానిక వస్తువులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ మంత్రి అమిత్‌షా బుధవారం ట్వీట్ చేశారు. (రష్యా అద్యక్షుడి అధికార ప్రతినిధికి కరోనా ) 'మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులంతా స్థానిక ఉత్పత్తులపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం భారత్‌ను రాబోయే రోజుల్లో ప్రపంచ నాయకత్వ మార్గంలోకి తీసుకెళుతుంది. సుమారు 10 లక్షల మంది సీఏపీఎఫ్ సిబ్బందితోపాటు వారి కుటుంబంలోని 50 లక్షల మంది సభ్యులు స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించనున్నారు'. అని తెలిపారు. కాగా కరోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊతమిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా పాడుగాను.. ఎంత కష్టమొచ్చే ) పారామిలిటరీ క్యాంటీన్లు ప్రతి ఏటా రూ .2,800 కోట్ల అమ్మకాలను జరుపుతున్నాయి. సీఏపీఎఫ్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సాశాస్త్రా సీమా బాల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎన్జీ)తోపాటు అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. వీరంతా భారతదేశంలో తయారైన వస్తువులను ప్రజలు ఉపయోగించాలని, ఇతరులు కూడా ఇలాగే చేయాలని హోంమంత్రి కోరారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) -
కశ్మీర్‌కు పదివేల బలగాలు
న్యూఢిల్లీ/కశ్మీర్: కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. కశ్మీర్ లోయకు పంపే వారిలో సీఆర్పీఎఫ్కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్నాథ్ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. జైషే టాప్ కమాండర్ హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి జైషే మహమ్మద్ (జేఎం)కు చెందిన కమాండర్ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్బజార్ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. -
కేంద్ర సాయుధ బలగాల్లో 62 వేల పోస్టులు
ఇఫ్లూ అడ్మిషన్లు ఇఫ్లూ యూనివర్సిటీకి హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఈ మూడు క్యాంపస్‌లలో ఎక్కడైనా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ క్యాంపస్ బీఏ (ఆనర్స్)- ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్ బీఈడీ (ఇంగ్లిష్) ఎంఏ (ఇంగ్లిష్) ఎంఏ జేఎంసీ (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) ఎంఏ (కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్) ఎంఈడీ పీజీ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ పీహెచ్డీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియా స్టడీస్, ఇంగ్లిష్ లిటరేచర్, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్, ఎడ్యుకేషన్, అస్థెటిక్స్ అండ్ ఫిలాసఫీ, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్) ఎంఏ (హిందీ, అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్) లక్నో క్యాంపస్ బీఏ (ఆనర్స్)-ఇంగ్లిష్ ఎంఏ (ఇంగ్లిష్) పీజీడీటీఈ (ఇంగ్లిష్) షిల్లాంగ్ క్యాంపస్ బీఏ (ఆనర్స్) -ఇంగ్లిష్ బీఏ జేఎంసీ (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) ఎంఏ (ఇంగ్లిష్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) పీహెచ్డీ (లింగ్విస్టిక్స్)ప్రవేశం: దాదాపు అన్ని కోర్సుల్లో రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కొన్ని కోర్సులకు మాత్రం రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి రెండు కోర్సులకు మించి దరఖాస్తు చేసుకునే వీలు లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2015 దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: మార్చి 5, 2015. రాత పరీక్షలు నిర్వహించే తేదీ: మార్చి 28, 2015. వెబ్సైట్: www.efluniversity.ac.in