
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో 41 స్పెషాలిటీ, సపర్ స్పెషాలిటీల్లో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నెల 17 నుంచి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది.
ఈనెల 26 దరఖాస్తుకు వరి గడువు. ఓసీ అభ్యర్థులు రూ.వెయ్యి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యఎస్, వికలాంగ అభ్యర్థులు ర.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుం.వెయ్యి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగ అభ్యర్థులు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్యకళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు కొత్తగా ఏర్పాటుచేసిన కడప మానసిక ఆస్పత్రి, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, పలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. ఈ పోస్టుల భర్తీలో భాగంగా తాజా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చర్యలు చేపట్టిన సీఎం జగన్ ప్రభుత్వం 50 వేలకుపైగా పోస్టులను భర్తీచేసింది.
చదవండి: ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా?
Comments
Please login to add a commentAdd a comment