Assistant Commandant jobs
-
మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..!
CRPF Assistant Commandant: విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు ఇంధన సంస్థలు... ఇలా ఏ సున్నిత ప్రాంతమైనా అది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పహారాలో ఉంటుంది. ఈ దళంలో పని చేయడానికి ఎంపికైన వారికి హైదరాబాద్ శివార్లలో ఉన్న హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (నిసా) ట్రైనింగ్ ఇస్తారు. ఈసారి శిక్షణ పొందిన 62 మందిలో స్నేహ ప్రదీప్ పాటిల్, భూమిక వార్షినే, కీర్తి యాదవ్ అనే ముగ్గురు మహిళలున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి... మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన స్నేహ ప్రదీప్ పాటిల్ తండ్రి రైతు. తల్లి గృహిణి. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన స్నేహ... యూపీఎస్సీ పరీక్షల కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నారు. ఆమెతో పాటు శిక్షణపొందిన అనేక మంది సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టారు. ఆ స్ఫూర్తితో ఆమె సీఐఎస్ఎఫ్ను ఎంచుకున్నారు. ‘శిక్షణలో పురుషులకు, స్త్రీలకు వేర్వేరు అంశాలు ఉండవు. ఈ నేపథ్యంలో మహిళలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సివిల్స్ రాసి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిగా దేశ సేవ చేయాలన్నది నా లక్ష్యం. అది సాధ్యం కాకుంటే సీఐఎస్ఎఫ్ ద్వారా సేవ చేస్తా’ అన్నారు స్నేహ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! తండ్రిని చూసి స్ఫూర్తి పొంది... హర్యానా, రివాడీ జిల్లాకు చెందిన కీర్తి యాదవ్ తండ్రి ప్రతాప్ సింగ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. ప్రస్తుతం వారెంట్ ఆఫీసర్. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ (ఆనర్స్) చేశారామె. ఢిల్లీలో ఉండి సివిల్స్‌కు తర్ఫీదు పొందుతుండగా... సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్) ద్వారా నిసాలో అడుగుపెట్టారు. ‘నిసాలో శిక్షణ అనేక కొత్త విషయాలను నేర్పింది. సెప్టెంబర్‌లో జరిగిన వారం రోజుల గ్రేహౌండ్స్ శిక్షణలో జంగిల్ క్యాంప్ జరిగింది. ఆ సమయంలో తీవ్ర వర్షాలు కురుస్తుండటంతో టాస్క్ కష్టసాధ్యమైంది. నా టార్గెట్ సివిల్స్’ అని కీర్తి తెలిపారు. ఎన్సీసీలో సక్సెస్ కావడంతో... ఉత్తరప్రదేశ్, బదాయు ప్రాంతానికి చెందిన భూమిక వార్షినే అలహాబాద్ యూనివర్శిటీ నుంచి బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన భూమిక కళాశాల రోజుల నుంచి ఎన్సీసీలో కీలకంగా వ్యవహరించే వారు. ఈమె చూపిన ప్రతిభ ఫలితంగా యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో శ్రీలంక వెళ్లి వచ్చారు. ఆ సమయంలోనే రక్షణ బలగాల్లో చేరాలని బలంగా నిర్ణయించుకున్నారు. ‘నిసాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. వార్షిక క్రీడా పోటీల్లో ఉత్తమ అథ్లెట్‌గా పీవీ సింధు చేతుల మీదుగా సత్కారం అందింది. శిక్షణలో చూపిన ప్రతిభతో పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్లటూన్ కమాండర్ అయ్యా. మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారాలని, నన్ను చూసి మరింత మంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టాలన్నదే నా లక్ష్యం’ అని భూమిక వివరించారు. ముగ్గురివీ అత్యత్తమ ర్యాంకులే... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (యూపీఎస్సీ) నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్ష ద్వారా అసిస్టెంట్ కమాండెంట్స్ (ఏసీ) శిక్షణకు ఎంపికయ్యారు ఈ ముగ్గురూ. గతేడాది జరిగిన ఈ పరీక్షకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనేక వడపోతల తర్వాత 62 మంది నిసా వరకు వచ్చారు. ఈ పరీక్ష ఆలిండియా ర్యాంకుల్లో భూమికకు తొమ్మిది, కీర్తికి 26, స్నేహకు 52వ ర్యాంక్ లు వచ్చాయి. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ చదవండి: మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా.. -
UPSC CAPF: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్,ఐటీబీపీ, ఎస్ఎస్బీల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్–సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో మొత్తం 159 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. సీఏపీఎఫ్–2021కు అర్హతలు.. ఎంపిక విధానం వివరాలు.. ► పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 159 ► పోస్టుల వివరాలు: బీఎస్ఎఫ్–35, సీఆర్పీఎఫ్–36,సీఐఎస్ఎఫ్–67,ఐటీబీపీ 20,ఎస్ఎస్బీ–01 అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన అర్హత ఉండాలి. 2021లో డిగ్రీ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. సీఏపీఎఫ్–2021 పరీక్షకు అవసరమైన నిర్దిష్ట శారీరక, ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు: 01.08.2021 నాటికి 20–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1996 –01.08.2001 మధ్య జన్మించి ఉండాలి. ∙ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/మెడికల్ స్టాండర్ట్ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష విధానం ► రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇవి రెండూ ఒకే రోజు నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ► పేపర్1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్‌పై–250 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది. ► పేపర్ 2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. ► రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్) ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టుకు పిలుస్తారు. ఇది 150 మార్కులకు జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 05.05.2021 ► పరీక్ష తేది: 08.08.2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://www.upsc.gov.in -
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు
జాబ్ పాయింట్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు జూన్ 1లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు: అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విధానంలో ఇంటర్ వరకు మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 60 శాతం మార్కులు. జనరల్ డ్యూటీ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1998 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు. టెక్నికల్ బ్రాంచ్ (మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్)కు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సెక్షన్-ఎ, సెక్షన్-బిలో ఉత్తీర్ణత. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించి ఉండాలి. షార్ట్ సర్వీస్ నియామకాలు: 8ఏళ్ల కాలానికి జరిపే ఈ షార్ట్ సర్వీస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల పదవీ కాలాన్ని పదేళ్లకు, పద్నాలుగేళ్లకు పొడిగించే వీలుంది. పైలట్స్ (సీపీఎల్): 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. దీంతోపాటు దరఖాస్తు చేసుకునే నాటికి డీజీసీఏ గుర్తింపు పొందిన కరంట్/వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లెసైన్స్ కలిగి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1998 తేదీల మధ్య జన్మించిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జనరల్ డ్యూటీ (ఉమెన్) పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విద్యా విధానంలో ఇంటర్ వరకు 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లను చదివి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1996 తేదీల మధ్య జన్మించిన మహిళా అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు. దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ దశను దాటిన వారికి తుది దశ పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in పోస్టుల వివరాలు ⇒ అసిస్టెంట్ కమాండెంట్లోని విభాగాలు.. ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (పైలట్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (మెకానికల్/ఏరోనాటికల్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ (కమర్షియల్ పైలట్ లెసైన్స్ - ఎస్ఎస్ఏ) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (ఉమెన్ -ఎస్ఎస్ఏ)