హైదరాబాద్ బ్యూరో : వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్-మచిలీపట్నం (07050/ 07049) రైలు మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 10.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 7.45 కు మచిలీపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే తేదీలలో రాత్రి 9.30 కు మచిలీపట్నం నుంచి బయలుదేరి తెల్లవారు జామున 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
విజయవాడ-తిరుపతి (07259/07260) స్పెషల్ ట్రైన్ మార్చి 5, 12, 19, 26 తేదీలలో రాత్రి 11.15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8, 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 11.55 కు విజయవాడకు చేరుకుంటుంది.
తిరుపతి-కాకినాడ (07261/07262) ప్రత్యేక రైలు మార్చి 6, 13, 20, 27 తేదీలలో మధ్యాహ్నం 3.30 కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 7, 14, 21, 28 తేదీలలో సాయంత్రం 7.15 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది.
భువనేశ్వర్-బెంగళూర్ (00851/00852) ప్రీమియం బై వీక్లీ ట్రైన్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 29 వరకు ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 10.50 కి భువనేశ్వర్ నుంచి బయలుదేరి గురు, ఆదివారాల్లో రాత్రి 10.40 కి బెంగళూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్ర, సోమ వారాల్లో తెల్లవారు జామున ఒంటిగంటకు బయలుదేరి ఆది, బుధ వారాల్లో తెల్లవారు జామున 1.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
భువనేశ్వర్-పూనే (02882/02881) ప్రీమియం స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 5 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10.15 కు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 5 గంటలకు పూనే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం ఉదయం 11.15 కు పూనే నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 5.35 కు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఇది సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
సికింద్రాబాద్-విశాఖ (08502/08501) వీక్లీ స్పెషల్ ఏప్రిల్ 7 నుంచి జూలై 1 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
విశాఖ-తిరుపతి (02873/02874) స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 6 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4.45కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 కు విశాఖ చేరుకుంటుంది.
హోలీ ప్రత్యేక రైళ్లు...
హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-పాట్నా (02791/02792) స్పెషల్ మార్చి 1వ తేదీన ఉదయం 6.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 కు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 3వ తేదీన రాత్రి 11.40 కి పాట్నా నుంచి బయలుదేరి మార్చి 5వ తేదీ ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
వేసవి ప్రత్యేక రైళ్లు ఇవీ..
Published Wed, Feb 25 2015 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement