Umasankar Kumar
-
సికింద్రాబాద్–రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–రెక్సాల్ (07091/07092) ప్రత్యేక రైలు ఈ నెల 28, ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30 జూన్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.40కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 6.15కు రెక్సాల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 31, ఏప్రిల్ 7, 14, 21, 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 12.45కు రెక్సాల్ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 6.55కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
25న కమాక్యా–బెంగుళూరు రైలు ప్రారంభం
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ నెల 25వ తేదీన కమాక్యా–బెంగళూరు కాంట్ హంసఫర్ వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (02504) 25న మధ్నాహ్యం 12.15 నిమిషాలకు కమాక్యాలో బయలుదేరి 27 సాయంత్రం 5 గంటలకు బెంగళూరు చేరుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 10.55 గంటలకు విజయవాడ చేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కమాక్యాకు చేరుకుంటుంది. తిరిగి కమాక్యాలో మంగళవారం రాత్రి 8.10 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 7.45 గంటలకు విజయవాడకు, గురువారం రాత్రి 9.15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. -
కాచిగూడ - టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-టాటానగర్ మధ్య వింటర్ స్పెషల్ ట్రైన్స నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-టాటానగర్ (07438/07439) ప్రత్యేక రైలు నవంబర్ 21, 28, డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.45కి టాటానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 22, 29 డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 10.50కి టాటానగర్ నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 5గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్ మీదుగా తిరుపతి-నాగర్సోల్ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సికింద్రాబాద్ మీదుగా తిరుపతి-నాగర్సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తిరుపతి-నాగర్సోల్ (07417/07418) ప్రత్యేక రైలు డిసెంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ఉదయం 7.30కి తిరుపతి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8.15కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 8.25కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55కి నాగర్సోల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 10 గంటలకు నాగర్సోల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 12.05కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు తిరుపతి చేరుకుంటుంది. బీదర్-థారూర్ మధ్య ప్రత్యేక రైళ్లు థారూర్ మెథడిస్ట్ చర్చిలో జరగనున్న క్రిస్టియన్ జాతర సందర్భంగా వికారాబాద్ మీదుగా బీదర్- థారూర్ మధ్య ప్రత్యేక డెము రైళ్లు నడపనున్నారు. ఈ మేరకు బీదర్-థారూర్ (07023/07024) డెము రైలు ఈ నెల 11, 13 తేదీల్లో ఉదయం 10 గంటలకు బీదర్ నుంచి బయలుదేరి 12.30కి వికారాబాద్ చేరుకుంటుంది. తిరిగి 12.50కి వికారాబాద్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1.30కి థారూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లోనే సాయంత్రం 7.20కి థారూర్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. 8.40కి వికారాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బీదర్ చేరుకుంటుంది. -
వేసవి ప్రత్యేక రైళ్లు ఇవీ..
హైదరాబాద్ బ్యూరో : వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-మచిలీపట్నం (07050/ 07049) రైలు మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 10.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 7.45 కు మచిలీపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే తేదీలలో రాత్రి 9.30 కు మచిలీపట్నం నుంచి బయలుదేరి తెల్లవారు జామున 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. విజయవాడ-తిరుపతి (07259/07260) స్పెషల్ ట్రైన్ మార్చి 5, 12, 19, 26 తేదీలలో రాత్రి 11.15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8, 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 11.55 కు విజయవాడకు చేరుకుంటుంది. తిరుపతి-కాకినాడ (07261/07262) ప్రత్యేక రైలు మార్చి 6, 13, 20, 27 తేదీలలో మధ్యాహ్నం 3.30 కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 7, 14, 21, 28 తేదీలలో సాయంత్రం 7.15 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది. భువనేశ్వర్-బెంగళూర్ (00851/00852) ప్రీమియం బై వీక్లీ ట్రైన్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 29 వరకు ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 10.50 కి భువనేశ్వర్ నుంచి బయలుదేరి గురు, ఆదివారాల్లో రాత్రి 10.40 కి బెంగళూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్ర, సోమ వారాల్లో తెల్లవారు జామున ఒంటిగంటకు బయలుదేరి ఆది, బుధ వారాల్లో తెల్లవారు జామున 1.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. భువనేశ్వర్-పూనే (02882/02881) ప్రీమియం స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 5 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10.15 కు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 5 గంటలకు పూనే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం ఉదయం 11.15 కు పూనే నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 5.35 కు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఇది సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్-విశాఖ (08502/08501) వీక్లీ స్పెషల్ ఏప్రిల్ 7 నుంచి జూలై 1 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ-తిరుపతి (02873/02874) స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 6 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4.45కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 కు విశాఖ చేరుకుంటుంది. హోలీ ప్రత్యేక రైళ్లు... హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-పాట్నా (02791/02792) స్పెషల్ మార్చి 1వ తేదీన ఉదయం 6.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 కు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 3వ తేదీన రాత్రి 11.40 కి పాట్నా నుంచి బయలుదేరి మార్చి 5వ తేదీ ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.