25న కమాక్యా–బెంగుళూరు రైలు ప్రారంభం | Kamakya - Bangalore Train Start on 25 | Sakshi
Sakshi News home page

25న కమాక్యా–బెంగుళూరు రైలు ప్రారంభం

Published Thu, Dec 22 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

Kamakya - Bangalore Train Start on 25

సాక్షి, అమరావతి బ్యూరో: ఈ నెల 25వ తేదీన కమాక్యా–బెంగళూరు కాంట్‌ హంసఫర్‌ వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (02504) 25న మధ్నాహ్యం 12.15 నిమిషాలకు కమాక్యాలో బయలుదేరి 27 సాయంత్రం 5 గంటలకు బెంగళూరు చేరుతుందని పేర్కొన్నారు.

ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 10.55 గంటలకు విజయవాడ చేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కమాక్యాకు చేరుకుంటుంది. తిరిగి కమాక్యాలో మంగళవారం రాత్రి 8.10 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 7.45 గంటలకు విజయవాడకు, గురువారం రాత్రి 9.15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement