కాచిగూడ - టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-టాటానగర్ మధ్య వింటర్ స్పెషల్ ట్రైన్‌స నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-టాటానగర్ (07438/07439) ప్రత్యేక రైలు నవంబర్ 21, 28, డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.45కి టాటానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 22, 29 డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 10.50కి టాటానగర్ నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 5గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ మీదుగా తిరుపతి-నాగర్‌సోల్
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సికింద్రాబాద్ మీదుగా తిరుపతి-నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తిరుపతి-నాగర్‌సోల్ (07417/07418) ప్రత్యేక రైలు డిసెంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ఉదయం 7.30కి తిరుపతి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8.15కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 8.25కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55కి నాగర్‌సోల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 10 గంటలకు నాగర్‌సోల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 12.05కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
బీదర్-థారూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
థారూర్ మెథడిస్ట్ చర్చిలో జరగనున్న క్రిస్టియన్ జాతర సందర్భంగా వికారాబాద్ మీదుగా బీదర్- థారూర్ మధ్య ప్రత్యేక డెము రైళ్లు నడపనున్నారు. ఈ మేరకు బీదర్-థారూర్ (07023/07024) డెము రైలు ఈ నెల 11, 13 తేదీల్లో ఉదయం 10 గంటలకు బీదర్ నుంచి బయలుదేరి 12.30కి వికారాబాద్ చేరుకుంటుంది. తిరిగి 12.50కి వికారాబాద్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1.30కి థారూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లోనే సాయంత్రం 7.20కి థారూర్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. 8.40కి వికారాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బీదర్ చేరుకుంటుంది.