దోపిడి జరిగిందని ఫిర్యాదు చేసిన మహిళతో రైల్వే అధికారులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన నగరంలోని మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ రైల్వే స్టేషన్‌లో కొందరు మాదక ద్రవ్యాల మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు ప్లాట్‌ఫాం పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వద్ద నుంచి కొందరు దుండగులు సెల్‌ఫోన్ లాక్కున్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ పట్ల రైల్వే పోలీసులు దురుసుగా వ్యవహరించారు. దీంతో బాదితురాలు గత కొన్ని రోజులుగా రైల్వే స్టేషన్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని.. మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవ ర్తించడం, ఈవిటీజింగ్‌కు పాల్పడటం వంటి చర్యలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది.