యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలం జగదేవ్‌పూర్ రోడ్డులోని రైల్వే గేట్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో రైల్వేగేట్ ధ్వంసమైంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి వచ్చి మరమ్మతులు చేపట్టారు.