అనంతపురం జిల్లా పెనుకొండలో గూడ్సురైలుకు పెను ప్రమాదం తప్పింది. బొంబాయి నుంచి బెంగళూరుకు పెట్రోల్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులోని ఎనిమిది ట్యాంకర్ల నుంచి పెట్రోల్ లీకేజి అవుతోంది. ఇది గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలును నిలిపేశాడు.
వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు బోగీలకు మరమ్మత్తులు చేస్తున్నారు. పెట్రోల్ లీకేజీని గుర్తించి వెంటనే గూడ్స్‌ను నిలిపివేసిన డ్రైవర్‌ను అధికారులు అభినందించారు. లీకేజీ గుర్తించక పోయిఉంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేద అభిప్రాయప్పడారు.