‘వ్యాగన్’ స్థలాన్ని పరిశీలించిన డీజీఎం
Published Sat, Aug 13 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
మడికొండ : రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం అయోధ్యపురంలో కేటాయించిన స్థలాన్ని శుక్రవారం సాయంత్రం రైల్వే శాఖ అధికారులు పరిశీలించారు. రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ చిరంజీవి, అసిస్టెంట్ మేనేజర్లు విశ్వనాథ్, మూర్తి తదితరులు స్థల పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాగన్ వర్క్‌షాప్‌నకు కేటాయించిన స్థలంలో మరో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పరిశీలించినట్లు తెలిపారు. అలాగే, ఇంకా స్థల సేకరణకు అవకాశం ఉందా అనే అంశంపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారి వెంట సర్వేయర్ నితిన్, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement