Wagon Factory
-
దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలకం: ప్రధాని మోదీ
వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడంలో తెలంగాణ పాత్ర ఉందని.. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా దేశ చరిత్రలో దీని పాత్ర చాలా కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలుగు ప్రజల సామర్థ్యంతో దేశ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి, రవాణా సదుపాయాలు పెంచడానికి కేంద్రం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించిందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని.. సబ్కా సాథ్ సబ్ కా వికాస్‌ను అనుసరిస్తూ హైవేలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. రూ.6,109 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రూ.5,500 కోట్లకుపైగా ఖర్చయ్యే జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు.. కాజీపేటలో తలపెట్టిన రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఈ సందర్భంగా విడిగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పెట్టుబడులకు, ఎదుగుదల అవకాశాలకు భారతదేశం పెట్టింది పేరుగా మారింది. 21వ శతాబ్దపు మూడో దశాబ్దం స్వర్ణ సమయంగా మారింది. ప్రస్తుత కాలం యువ భారత్‌కు గోల్డెన్ పీరియడ్. ప్రతి సెకన్ను సద్వినియోగం చేసుకో వాలి. వేగంగా సాగుతున్న అభివృద్ధిలో దేశంలోని ఏ ప్రాంతాన్నీ వదలకుండా ముందుకు తీసుకెళ్తాం. సరి కొత్త లక్ష్యాల సాధన కోసం కొత్త మార్గాలు కనుక్కో వాలి. అప్పుడే దేశ అభి వృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇప్పుడున్న మౌలిక వసతు లతో ఇది అసాధ్యం కాబట్టే.. కొత్త మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అందుకే ఎక్స్‌ప్రెస్ హైవే లు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్థిక కారిడార్లను, జాతీయ రహదారు ల విస్తరణను చేపట్టి.. రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. చదవండి: స్వాగతానికి అధికారులు మాత్రమే! ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తెలంగాణ తెలంగాణలో జాతీయ రహదారుల నెట్వర్క్ గతంలో 2,500 కిలోమీటర్లే ఉండగా.. ఇప్పుడు 5 వేల కిలోమీటర్లకుపైగా పెరి గింది. మరో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా డజన్ల కొద్దీ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని తెలంగాణ మీదుగా వెళుతున్నాయి. హైదరాబాద్ – ఇండోర్ ఆర్థిక కారిడార్, చెన్నై – సూరత్ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – పనాజీ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – విశాఖపట్నం ఇంటర్ కారిడార్ ఆ కోవలోనివే. ఒక విధంగా తెలంగాణ చుట్టు పక్కల ఉన్న అనేక ఆర్థిక ప్రాంతాలకు, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా తయారవుతోంది. ఈ హైవేలతో ఎంతో ప్రయోజనం ఇప్పుడు శంకుస్థాపన చేసిన నాగ్‌పూర్ – విజయ వాడ కారిడార్‌లోని మంచిర్యాల–వరంగల్ సెక్షన్ నిర్మాణంతో.. తెలంగాణకు అటు మహారాష్ట్రతో, ఇటు ఏపీతో మెరుగైన అనుసంధానాన్ని కలిగిస్తుంది. మంచిర్యాల–వరంగల్ మధ్య దూరం తగ్గి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది. కరీంనగర్–వరంగల్ సెక్షన్‌ను నాలుగు లేన్ల రహదారిగా మార్చటం వలన హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ ఎస్ఈజెడ్ వంటివి ఎక్కువగా లబ్ధి పొందుతాయి. వ్యవసాయం, పరిశ్రమలతోపాటు కరీంనగర్ జిల్లా లోని గ్రానైట్ పరిశ్రమకూ ప్రయోజనం ఉంటుంది. యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశా లు కూడా పెరుగుతాయి. కనెక్టివిటీ పెర గడం వల్ల పర్యాటక రంగం కూడా లబ్ధి పొందుతుంది. భద్రకాళి ఆలయంలో మోదీ పూజలు వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. అర్చకులు, అధికారులు ప్రధానికి మేళతాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మోదీ గోశాలలో ఆవులకు గ్రాసం తినిపించి, ధ్వజస్తంభం వద్ద జ్యోతి వెలిగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు.. అమ్మవారి శేషవస్త్రంతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించిందని ప్రధాని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా.. ఓ ఉద్యమం.. మేకిన్ ఇండియా ఒక ఉద్యమం. పీఎల్ఐ పథకంతో దేశంలో తయారీ రంగానికి ఎంతో ప్రోత్సా హం లభించింది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోనూ ఈ పథకం కింద 50కిపైగా పెద్ద సంస్థలు లబ్ధిపొందుతున్నాయి. దేశం ఈ ఏడాది రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో రికార్డు సృష్టించింది. తొమ్మిదేళ్ల కింద రూ.1,000 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు రూ.16 వేల కోట్లు దాటాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఇలా ఎగుమతులు చేసిన సంస్థల్లో ఉంది. తయారీ రంగంలో భారత రైల్వే కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మేడిన్ ఇండియా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. కాజీపేటలో ఈరోజు శంకుస్థాపన చేసిన రైల్వే తయారీ యూనిట్ మేకిన్ ఇండియాకు కొత్త జీవం పోస్తుంది. దీనితో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబమూ ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంది. అభివృద్ధి మంత్రంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలి..’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట వ్యాగన్ల పరిశ్రమ రెండో అతిపెద్దది
కాజీపేట రూరల్: భారతీయ రైల్వేలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ కాజీపేటలో నిర్మాణం కాబోతోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామశివారులో ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్న రైల్వే వ్యాగ న్ల తయారీ పరిశ్రమస్థలాన్ని, అక్కడ జరుగుతున్న పను లను గురువారం అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేతోపాటు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఈ పరిశ్రమను నిర్మిస్తుందన్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సంస్థ సహకారంతో రొబొటిక్ సిస్టం ద్వారా నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఆదారంగా వివిధ రకాల రోలింగ్ స్టాక్లను ఉత్పత్తి చేస్తుంద న్నారు. జిల్లాలో కొత్త పారి శ్రా మిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థను ప్రోత్స హి స్తుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందన్నారు. రూ.521 కోట్ల వ్య యంతో 160.4 ఎకరాల విస్థీర్ణంలో నిర్మాణం కానున్న వ్యా గన్ల తయారీ పరిశ్రమలో నెలకు 200 వ్యాగన్ల పీరి యాడికల్ ఓవరాయిలింగ్ (పీవోహెచ్) చేసేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ మంజూరైందని, సంవత్సరానికి 1,200 వ్యాగన్లు, రెండో సంవత్సరానికి 2,400 వ్యాగన్లను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మా ణం కానున్న వ్యాగన్ల తయారీ పరిశ్రమను 24 నెలల్లోపూర్తి చేసి 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాగన్ల తయారీ పరిశ్రమ వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం ఏకే గుప్తా, ఆర్వీఎన్ఎల్ సీపీఎం మున్నకుమార్ పాల్గొన్నారు. -
కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు.. వర్క్‌షాప్ కాదు.. వ్యాగన్ ఫ్యాక్టరీనే!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు రాబోతోంది. కాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌కు బదులుగా నేరుగా వ్యాగన్ల తయారీ ప్రాజెక్టునే రైల్వే ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రైల్వే పరోక్షంగా స్పష్టతనిచ్చింది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీలో తొలి ఏడాది 1200 వ్యాగన్లను తయారు చేస్తామని.. తర్వాత ఈ సామర్థ్యాన్ని 2400కు పెంచుతామని శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా మూడు దశాబ్దాల కింద కాజీపేటకు మంజూరై.. ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు దేశంలో రైలు వ్యాగన్లు తయారు చేసేందుకు రైల్వేకు పశ్చిమ బెంగాల్లో ఒక్క సొంత యూనిట్ మాత్రమే ఉండగా.. కాజీపేటలో రెండోది ఏర్పాటుకానుంది. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ‘సాక్షి’ఫిబ్రవరి నెలలోనే కథనం ప్రచురించింది కూడా. ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభం కాజీపేట సమీపంలోని మడికొండలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన 160 ఎకరాల స్థలంలో వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. తొలుత ఇక్కడ రూ.269 కోట్లతో ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను నిర్మించాలని నిర్ణయించి.. రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గతేడాది టెండర్లు పిలిచారు. మాదాపూర్‌కు చెందిన పవర్ మెక్–టైకిషా జెవీ అనే సంస్థ రూ.361.79 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఇప్పుడా ప్రాజెక్టు వ్యాగన్ ఫ్యాక్టరీగా మారిన నేపథ్యంలో.. అదే సంస్థ పనులు చేపట్టనుందని సమాచారం. ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ వ్యాగన్ ఫ్యాక్టరీని అధికారికంగా ప్రకటించి, శంకుస్థాపన చేయనున్నరని అధికారులు చెప్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వ్యాగన్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అంటున్నారు. విమర్శలకు కౌంటర్‌గా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాజీపేటలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకోసం రూ.160 కోట్లు కేటాయించారు. కానీ తర్వాత రాజకీయంగా వస్తున్న విమర్శలను కౌంటర్ చేసేలా కాజీపేట యూనిట్‌ను వాగన్ ఫ్యాక్టరీగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ యూనిట్ వల్ల 2వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. యూనిట్‌ను ఫ్యాక్టరీగా మార్చినందున కొత్తగా గ్యాంగ్ డ్రిల్లింగ్ యంత్రం, షీరింగ్ యంత్రం, బెంచ్ ప్రెస్, యూనివర్సల్ అండర్ ఫ్రేమ్ వెల్డింగ్ మ్యానిప్యులేటర్స్, స్ట్రైటెనింగ్ యంత్రం, హుక్ బోల్టింగ్ యంత్రం వంటి పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
‘వ్యాగన్’ స్థలాన్ని పరిశీలించిన డీజీఎం
మడికొండ : రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం అయోధ్యపురంలో కేటాయించిన స్థలాన్ని శుక్రవారం సాయంత్రం రైల్వే శాఖ అధికారులు పరిశీలించారు. రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ చిరంజీవి, అసిస్టెంట్ మేనేజర్లు విశ్వనాథ్, మూర్తి తదితరులు స్థల పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాగన్ వర్క్‌షాప్‌నకు కేటాయించిన స్థలంలో మరో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పరిశీలించినట్లు తెలిపారు. అలాగే, ఇంకా స్థల సేకరణకు అవకాశం ఉందా అనే అంశంపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారి వెంట సర్వేయర్ నితిన్, అధికారులు పాల్గొన్నారు. -
ఖర్గే కానిచ్చేశాడు.. మనవి అటకెక్కించారు
♦ కర్ణాటకకు మంజూరైన రైలు బోగీ ఫ్యాక్టరీ ఉత్పత్తికి సిద్ధం ♦ ఆరేళ్లు దాటినా పునాదిరాయి పడని కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ ♦ కర్నూలుకు రెండు వర్క్‌షాపులు మంజూరైనా ఫలితం శూన్యం ♦ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్న తెలుగు రాష్ట్రాలు సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టు ప్రకటన... చకచకా నిధుల విడుదల.. సకాలంలో పనులు పూర్తి.. ఉత్పత్తి ప్రారంభం.. కేవలం రెండేళ్ల పరిణామక్రమమిది.పోరాటం ఫలితంగా ఓ ప్రాజెక్టు మంజూరు.. ఆరేళ్లు గడిచినా అతీగతీ లేని పనులు.. అసలు ఆ ప్రాజెక్టు ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం. మొదటిది కర్ణాటకలోని యాద్గిర్ వద్ద బడియాల్ గ్రామంలో రైలు బోగీ ఫ్రేములు తయారయ్యే ఫియెట్ బోగీ యూనిట్ పరిస్థితి. రెండోది వరంగల్ జిల్లా కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీ దుస్థితి. రెంటికి ఎంత తేడా... ‘వడ్డించేవాడు మనవాడైతే’ తరహాలో కర్ణాటక ఆ ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటే... తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి లేకపోవడంతో చేతికందిన ప్రాజెక్టును కోల్పోయే పరిస్థితి. మరో రైల్వే బడ్జెట్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనూ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నాయి. మంజూరైన ప్రాజెక్టుల ఊసే లేని సమయంలో కొత్త ప్రాజెక్టుల రాక దాదాపు అసాధ్యమే. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రైల్వే మంత్రిగా ఉండగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి భారీ రైల్వే ప్రాజెక్టు సాధించాలని భావించారు. వెంటనే 2014 రైల్వే బడ్జెట్లో యాద్గిర్ ప్రాంతానికి రైల్వే ఫియెట్ బోగీ తయారీ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. రూ.750 కోట్లతో పనులు మొదలుపెట్టారు. ఇప్పుడవి పూర్తికావచ్చాయి. జూన్‌లో ఉత్పత్తి మొదలుకానుంది. ఆ యూని ట్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు పేర్లు ఇవ్వాలంటూ రైల్వే బోర్డు నుంచి అన్ని జోన్లకు సర్క్యులర్ వెళ్లింది. ఏడాదికి 600 బోగీ ఫ్రేములు ఇక్కడ తయారు కానున్నాయి. వేలమందికి ఉపాధి దొరకనుంది. అంతా డోలాయమానం కాజీపేటకు మూడు దశాబ్దాల క్రితమే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. రాజకీయ పరిణామాలతో దాన్ని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా పంజాబ్‌లోని కపుర్తలాకు మార్చారు. దాని స్థానంలో ఆరేళ్ల క్రితం కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. దానికి సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదనే కారణంతో పనులకు శ్రీకారమే చుట్టలేదు. ఇటీవల దాన్ని కూడా రద్దు చేసి వ్యాగన్ మరమ్మతు వర్క్‌షాపుగా మార్చాలనే నిర్ణయానికి రైల్వే బోర్డు వచ్చినట్టు తెలిసింది. తుదకు అది కూడా మంజూరవుతుందనే నమ్మకం లేకుండాపోయింది. సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్న 300 పడకల రైల్వే ఆసుపత్రికి అనుబంధంగా మౌలాలీలో మెడికల్ కళాశాల మంజూరై నాలుగేళ్ల క్రితం బడ్జెట్లో చోటు దక్కించుకున్నా ఇప్పటి వరకు దాని ఊసేలేదు. ఇప్పుడు దాని అవసరం లేదని రైల్వే బోర్డు భావిస్తోందట. దీంతోపాటు సికింద్రాబాద్‌లో ‘సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫైనాన్స్ ఆఫీసర్స్’ పేరుతో అధికారుల శిక్షణ కేంద్రం మంజూరైనా అది కూడా అతీగతీ లేదు. ‘సహాయ మంత్రి’కి మొండిచేయి రైల్వే మంత్రిగానో, సహాయ మంత్రిగానో ఉన్నవారు వారి ప్రాంతానికి ప్రాజెక్టులు మంజూరు చేయించుకోవటం సహజం. ఇదే పంథాలో కర్నూలుకు రైల్వే సహాయమంత్రి హోదాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రెండు ప్రాజెక్టులు మంజూరు చేయించారు. జీవితకాలం పూర్తి కాకుండా పాడయ్యే కోచులను బాగు చేసే ‘కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాపు’, డెమూ రైలు బోగీలను మరమ్మతు చేసే మరో వర్క్‌షాపును 2013లో మంజూరు చేయించారు. వీటికి భూమినీ సిద్ధం చేశారు. కానీ వెంటనే పనులు మొదలు పెట్టించలేకపోయారు. యూపీయే స్థానంలో ఎన్డీయే అధికారంరోకి రావటంతో అవి కాస్తా అటకెక్కాయి. రైల్ నీరు తయారయ్యే ఫ్యాక్టరీ విజయవాడకు మంజూరై మూడేళ్లవుతున్నా అది కూడా అంతే.