కాజీపేట రూరల్: భారతీయ రైల్వేలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ కాజీపేటలో నిర్మాణం కాబోతోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామశివారులో ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్న రైల్వే వ్యాగ న్‌ల తయారీ పరిశ్రమస్థలాన్ని, అక్కడ జరుగుతున్న పను లను గురువారం అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేతోపాటు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఈ పరిశ్రమను నిర్మిస్తుందన్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) సంస్థ సహకారంతో రొబొటిక్ సిస్టం ద్వారా నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వ్యాగన్‌ల తయారీ పరిశ్రమకు ఆదారంగా వివిధ రకాల రోలింగ్ స్టాక్‌లను ఉత్పత్తి చేస్తుంద న్నారు. జిల్లాలో కొత్త పారి శ్రా మిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థను ప్రోత్స హి స్తుందని తెలిపారు.
దీంతో ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందన్నారు. రూ.521 కోట్ల వ్య యంతో 160.4 ఎకరాల విస్థీర్ణంలో నిర్మాణం కానున్న వ్యా గన్‌ల తయారీ పరిశ్రమలో నెలకు 200 వ్యాగన్ల పీరి యాడికల్ ఓవరాయిలింగ్ (పీవోహెచ్) చేసేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ మంజూరైందని, సంవత్సరానికి 1,200 వ్యాగన్లు, రెండో సంవత్సరానికి 2,400 వ్యాగన్‌లను ఉత్పత్తి చేస్తుందని వివరించారు.
అత్యాధునిక టెక్నాలజీతో నిర్మా ణం కానున్న వ్యాగన్‌ల తయారీ పరిశ్రమను 24 నెలల్లోపూర్తి చేసి 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాగన్‌ల తయారీ పరిశ్రమ వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం ఏకే గుప్తా, ఆర్‌వీఎన్‌ఎల్ సీపీఎం మున్నకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment