arunkumar
-
కాజీపేట వ్యాగన్ల పరిశ్రమ రెండో అతిపెద్దది
కాజీపేట రూరల్: భారతీయ రైల్వేలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ కాజీపేటలో నిర్మాణం కాబోతోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామశివారులో ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్న రైల్వే వ్యాగ న్ల తయారీ పరిశ్రమస్థలాన్ని, అక్కడ జరుగుతున్న పను లను గురువారం అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేతోపాటు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఈ పరిశ్రమను నిర్మిస్తుందన్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సంస్థ సహకారంతో రొబొటిక్ సిస్టం ద్వారా నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఆదారంగా వివిధ రకాల రోలింగ్ స్టాక్లను ఉత్పత్తి చేస్తుంద న్నారు. జిల్లాలో కొత్త పారి శ్రా మిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థను ప్రోత్స హి స్తుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందన్నారు. రూ.521 కోట్ల వ్య యంతో 160.4 ఎకరాల విస్థీర్ణంలో నిర్మాణం కానున్న వ్యా గన్ల తయారీ పరిశ్రమలో నెలకు 200 వ్యాగన్ల పీరి యాడికల్ ఓవరాయిలింగ్ (పీవోహెచ్) చేసేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ మంజూరైందని, సంవత్సరానికి 1,200 వ్యాగన్లు, రెండో సంవత్సరానికి 2,400 వ్యాగన్లను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మా ణం కానున్న వ్యాగన్ల తయారీ పరిశ్రమను 24 నెలల్లోపూర్తి చేసి 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాగన్ల తయారీ పరిశ్రమ వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం ఏకే గుప్తా, ఆర్వీఎన్ఎల్ సీపీఎం మున్నకుమార్ పాల్గొన్నారు. -
భర్త హోటల్లో పని చేసే సప్లయర్‌తో భార్య వివాహేతర సంబంధం
కర్ణాటక: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడి సహా ఐదుగురిని తలఘట్టపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...గతనెల 29న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా నణ్ణూరుకు చెందిన అరుణ్‌కుమార్ (34) ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి రోడ్డులో జేఎస్ఎస్ కళాశాల పక్కన హోటల్ నడిపిస్తున్నాడు. ఆ హోటల్‌కు గణేశ్ అనే వ్యక్తి నీటిని సరఫరా చేస్తున్నాడు. ఇతనితో అరుణ్‌కుమార్ భార్య రంజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి తోడు అరుణ్‌కుమార్, గణేశ్‌తో చేబదులుగా కొంత నగదు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే గణేశ్, రంజిత వివాహేతర సంబంధం గురించి అరుణ్ తెలుసుకుని భార్యను తీవ్రంగా మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. గతనెల 28న పార్టీ చేసుకుందామని చెప్పి అరుణ్‌ను గణేశ్ అతని శివానంద, దీపు, శరత్‌లు పిలిపించారు. అరుణ్ రాగానే అతని కళ్లపై కారంపొడి చల్లి మారణాయుధాలతో చంపి హత్య చేశారు. మరుసటి రోజు తలఘట్టపుర పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా రంజిత మొబైల్ ఫోన్‌కాల్ డేటా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
- కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపు - కాకినాడలో టీబీ నిర్మూలన దినోత్సవ ర్యాలీ కాకినాడ వైద్యం : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి(జీజీహెచ్)లో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏటా ఒక కొత్త రోగి నుంచి క్షయ వ్యాధి 15 మందికి సోకుతోందని, దీనినిబట్టి దీని ప్రభావం సమాజంపై ఏమేరకు పడుతోందో గుర్తించాలని అన్నారు. క్షయ నివారణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి, ఉచితంగా మందులు అందిస్తోందన్నారు. ఈ కారణంగా వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో రోగ నిర్ధారణకు చాలా రోజులు పట్టేదని, ప్రస్తుతం అత్యాధునిక విధానాలతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే కళ్లె పరీక్షతో క్షయ వ్యాధిని గుర్తిస్తున్నారని చెప్పారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా డాట్ చికిత్స పొంది ఆరోగ్యంగా జీవించాలని కోరారు. రోగులు సక్రమంగా మందులు వేసుకోకపోతే వ్యాధి తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రోగి ఇంటికే డాట్ ప్రొవైడర్లు వెళ్లి చికిత్స అందించే ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని వివరించారు. ఏజెన్సీలో క్షయ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అక్కడ ప్రత్యేక అవగాహన సమావేశాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 2,656 మందికి డాట్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో 261 మందికి ఈ చికిత్స అందిస్తున్నామన్నారు. వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పారా మెడికల్, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వాస్పత్రి నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకూ సాగింది. అక్కడ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ-2 రాధాకృష్ణమూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, జెబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
లక్ష్య సాధనకు కృషి చేయాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : ఆరోగ్యమిత్రలు ఇచ్చిన లక్ష్య సాధనకు కృషి చేయాలని, లక్ష్యం సాధించని వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ హాలులో ఆరోగ్య రక్ష కార్యక్రమంపై కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్యమిత్రలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 7వ తేదీన ఆరోగ్య రక్ష పథకం ప్రారంభిస్తోందని దీనిని అందరూ వినియోగించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఏప్రిల్ 6వ తేదీలోపు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చునని, ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య పథకమైనందున దీనిని అమలు చేయాల్సిన బాధ్యత ఆరోగ్యమిత్రలపై ఉందన్నారు. డోర్ టూ డోర్ క్యాంపైన్ నిర్వహించి అర్హులైన కుటుంబాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సంవత్సరానికి కుటుంబంలోని పిల్లల నుంచి పెద్దల వరకు ఒక్కొక్కరికి రూ.1,200 చొప్పున చెల్లించి హెల్త్‌కార్డు పొందాలన్నారు. ఈ పథకం ద్వారా 410 నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స చేయించుకోవచ్చునన్నారు. 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్వార్డు (ఏసీ)లో వైద్యం అందిస్తారన్నారు. హెల్త్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రూ.2లక్షల వరకు వైద్యసహాయం పొందవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రాజు, డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.చంద్రయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌కిషోర్ పాల్గొన్నారు. -
నకిలీ కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్
జడ్చర్ల: నకిలీ చెరెన్సీ చెలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.80 వేల విలువైన 1000 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా నాయకుడు అరుణ్ పరారీలో ఉన్నాడు. వీరంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, మిగతా నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. -
చెల్లి సంతోషం కోసమే బావ హత్య
సాక్షి, సిటీబ్యూరో: ‘బీటెక్ చదివాడంటే కట్నకానుకలతో మా చెల్లిని ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాం. ఆరు నెలలకే అన్నతో కలిసి వేధింపులు మొదలెట్టాడు. విడాకుల అంశం కోర్టులో ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు. తరచు నా చెల్లిని ఇబ్బందులకు గురిచేస్తూ అతడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. అందుకే చెల్లి సంతోషం కోసం ఇలా చేశా’ - సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌ను సుపారీ హత్య చేయించిన అరుణ్‌కుమార్ మీడియాతో చెప్పిన మాటలివి. నాడు బావ (మద్దెలచెర్వు సూరి) కళ్లల్లో ఆనందం కోసం పరిటాల రవిని కాల్చానని మొద్దు శీను చెప్పగా... నేడు చెల్లెలి సంతోషం కోసం బావను హత్య చేయించానంటూ అరుణ్‌కుమార్ చెప్పుకొచ్చాడు. ఎస్సార్ నగర్ ఠాణాలో మిస్సింగ్‌గా నమోదై... హత్యగా మారిన ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. అదనపు డీసీపీ కె.నాగరాజు, పంజగుట్ట ఏసీపీ డి.వెంకట నర్సయ్యలతో కలిసి ఆయన తన కార్యాలయంలో విలేకరులకు పూర్తి వివరాలు వెల్లడించారు. అధికారులు, నిందితుడు అరుణ్‌కుమార్ కథనం ప్రకారం... పెళ్లైన ఆరు నెలలకే వేధింపులు... ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న అరుణ్‌కుమార్ గౌడ్ గతంలో నగరంలోనే ఉన్నాడు. బీకే గూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌గౌడ్ బీటెక్ చదివాడని అతడి కుటుంబీకులు చెప్పడంతో తన సోదరి సంధ్యను ఇచ్చి 2006 జూలై 31న పెళ్లి చేశాడు. పెళ్లైన ఆరు నెలలకే భర్తతో పాటు అతడి సోదరుడు విజయ్బాబుగౌడ్ నుంచి సంధ్యకు కట్నం వేధింపులు ఎదురయ్యాయి. దీంతో చెన్నైలోని సీ-2 పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ పరిణామాలతో ఇద్దరూ విడాకుల కోసం చెన్నైతో పాటు నగరంలోని కోర్టులోనూ దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్న సందర్భంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్‌గౌడ్ కట్నకానుకల్ని తిరిగి ఇవ్వడంతో పాటు బాలానగర్‌లోని ఫ్లాట్‌ను ఇవ్వాల్సి ఉండగా... అరుణ్ ఎన్నిసార్లు కోరినా తూలనాడాడు. మరోపక్క ఏడాదిన్నర క్రితం చంద్రశేఖర్ తరఫువారు చెన్నైలోని సంధ్య ఇంటికి వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. ఆమె కోర్టు వాయిదాల కోసం నగరానికి వచ్చిన ప్రతీసారి విజయ్‌బాబు మనుషులు వేధించడంతో పాటు బెదిరించారు. స్నేహితులతో చర్చించి పథకం... ఓ పక్క తన చెల్లి కాపురం చెడిపోగా, బావ మరో యువతిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండటాన్ని అరుణ్‌కుమార్ జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయాన్ని నగరానికి చెందిన తన స్నేహితుడు మహ్మద్ యూనుస్ పాషాకు చెప్పాడు. అతడిని రెండుమూడుసార్లు కలిసి చర్చించుకున్న తరవాతే చంద్రశేఖర్‌ను మట్టుపెట్టించాలని అరుణ్ నిర్ణయించుకున్నాడు. నేరుగా తానే నేరం చేస్తే పోలీసులకు చిక్కిపోవచ్చని ఆ బాధ్యతల్ని పాషాకే అప్పగించి ‘పని’ పూర్తయ్యాక రూ.6.5 లక్షల సుపారీ ఇస్తానని ఒప్పుకున్నాడు. చంపిన తరవాత ఆ ఫొటోలను తనకు మెయిల్ చేయాలని షరతుపెట్టాడు. పాషా తన స్నేహితులైన మధు, శివలతో కలిసి రంగంలోకి దిగి.. చంద్రశేఖర్ కదలికలు, వ్యవహారశైలిని పూర్తిగా అధ్యయనం చేశాడు. ఇంటి నుంచే కిడ్నాప్ చేసి.. చంద్రశేఖర్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ పలు సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇతడి రెండో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఈ విషయం పసిగట్టిన ముగ్గురు ముష్కరులు 4వ తేదీ తెల్లవారుజామున 4.30కి కారులో అతడి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి శబ్ధం చేయకుండా ఇంట్లోకి ప్రవేశించి.. నిద్రలో ఉన్న చంద్రశేఖర్‌గౌడ్‌కు మత్తు ఇచ్చారు. స్పృహకోల్పోయిన అతడిని కారులో కిడ్నాప్ చేసుకెళ్లి.. కారులోనే హత్య చేసి వికారాబాద్ శివార్లలో పడేశారు. కారులోనే తీసిన మృతదేహం ఫొటోలను అదే రోజు ఉదయం 10.15 గంటలకు పాషా తన మెయిల్ ఐడీ నుంచి అరుణ్‌కు చెందిన ఐడీకి పంపాడు. ఈ మెయిల్లో ‘ఐ హ్యావ్ ఎటాచ్డ్ బాస్టర్డ్ డెడ్ ఫొటోస్ జస్ట్ సీ ధెమ్’ అని రాస్తూ... సుపారీ మొత్తాన్ని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచేశాడు. ఈ మొత్తంలో రూ.5 లక్షలు తన ఖాతాలో వేయమని, మిగిలింది తన క్లినిక్‌లో అప్పగించమని రాశాడు. తండ్రికి కానుకగా బావ చావు... సంధ్య ఉదంతంతో అరుణ్‌కుమార్ కుటుంబం మొత్తం తీవ్ర మనస్తాపానికి గురైంది. ముఖ్యంగా అతడి తండ్రి బాగా డీలా పడిపోయాడు. మంగళవారం ఆయన పుట్టిన రోజు కావడంతో ఆ కానుకగా తన బావ చావు వార్త, ఫొటోలను అందించాలని అరుణ్ భావించాడు. ఈ నేపథ్యంలోనే పాషా నుంచి తనకు వచ్చిన ఫొటోలను సంధ్యతో పాటు మరో సోదరుడికీ మెయిల్ ద్వారా పంపిస్తూ... ‘ఐ హ్యావ్ అటాచ్డ్ బాస్టర్డ్ డెత్ ఫొటోస్. దట్ ఈజ్ గిఫ్ట్ టు మై డాడ్ ఆన్ హిజ్ బర్త్ డే’ అని రాశాడు. ఈ ఫొటోలు ఫేస్‌బుక్‌లోకి ఎక్కడంతో పోలీసుల సాంకేతిక దర్యాప్తు ప్రారంభమై అరుణ్, పాషా, మధు కటకటాల్లోకి చేరారు. పరారీలో ఉన్న శివ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యలో సంధ్య పాత్ర ఉన్నట్లు తేలితే ఆమె పైనా చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. -
2014లోగా విభజన జరగదు!
సాక్షి, హైదరాబాద్: 2014 లోగా రాష్ట్ర విభజన జరగదని రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లును ప్రవేశపెట్టే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే విభజన బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు పంపరనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర విభజనలో భాగస్వామి కాదల్చుకోకనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనుకోవడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఓ హోటల్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి పాల్గొన్నారు. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెవుల కృష్ణాంజనేయులు, ఎం.వంశీకృష్ణ, సలహాదారులు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్ఎం బాషా, కందుల రమేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన నేపథ్యంలో 371 (డి) అధికరణను రద్దు చేయడం అనివార్యమా? కాదా? అనే దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. విభజన ముసాయిదా బిల్లుపైఅసెంబ్లీ అభిప్రాయం తప్పనిసరి. మెజారిటీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాత్ర కీలకమవుతుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఈ నెల 23న రాష్ర్టపతిని తనతోపాటు 40 మంది నాయకులు కలవబోతున్నామన్నారు. రాష్ట్రం విడిపోతే కోస్తాకు వచ్చిన నష్టమేమీ లేద ని, తెలంగాణకే వెయ్యి రెట్ల ఎక్కవ నష్టం జరుగుతుందని ఉండవల్లి అన్నారు. రాయలసీమ ఎడారైపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. అయినా సీమాంధ్రోళ్లు దోపిడీదారులు అంటే ఒప్పుకునేది లేదన్నారు. కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు దొరికినందు వల్లే పార్టీ తమను పట్టించుకోవడం లేదంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలో స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన, ఇతర పార్టీల్లో చేరాలనే భావన లేదని, రాజకీయాలను వదిలేసే ప్రసక్తి కూడా లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. -
ఎమిటీ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఎమిటీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నోయిడా పోలీసులు శనివారం తెలిపారు. వసంత్‌కుంజ్ ప్రాంతంలోని ఘిటోర్నీ గ్రామంలోని తన ఇంట్లోనే అరుణ్‌కుమార్ లోహియా ఉదయం ఆరింటికి ఉరి వేసుకున్నాడని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించ ాల్సిందిగా ఘటనాస్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. -
అభివృద్ధి పేరుతో వనరుల విధ్వంసం
జులైవాడ, న్యూస్‌లైన్ : అభివృద్ధి పేరుతో ఆదివాసీల వనరులను విధ్వంసం చేస్తున్నారని ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి మైపతి అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కళాశాలలో మానవహక్కుల వేదిక జిల్లా ఐదో మహాసభలు ఆదివారం ముగిశాయి. సభలకు మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాల శోభారాణి అధ్యక్షత వహించారు. సభాప్రాంగణానికి మానవహక్కుల వేదిక నాయకులు కె.బాలగోపాల్, బుర్రా రాములు నామకరణం చేశారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు 10 ఆదివాసీ జిల్లాలు ఉన్నాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పోడు పేరుతో గిరిజనేతరులు అటవీ భూములను సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో హైడల్ విద్యుత్ ప్రాజెక్టుతో కుంటాల జలపాతం, పురాతన సోమేశ్వర స్వామి దేవాలయం నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరులోనే 21 వేల మంది గిరిజనేతరులు పోడు చేసుకుంటున్నారని వివరించారు. ఓపెన్కాస్ట్తో 244 ఆదివాసీ గూడేలు లేకుండా పోతున్నాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆది వాసీలు మాత్రమే ఉన్నప్పుడు పులులు, జం తు జాతులు ఉన్నాయని చెప్పారు. గిరిజనేతరులు వచ్చాక పులుల జాడ కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులైతే గిరిజనేతరులు వ్యాపారదృక్ప థం కలిగిన వారని వివరించారు. గిరిజనేతరులతో అటవీ విధ్వంసం జరుగుతోందన్నారు. కామన్‌స్కూల్ విధానం రావాలి.. భారత విద్యావిధానంలో కామన్ స్కూల్ విధానం రావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎర్రంరెడ్డి నర్సింహరెడ్డి అన్నారు. విద్యారంగం ప్రైవేటికీకరణపై మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఒక్కోవిద్యార్థికి ప్రభుత్వం విద్యాపరంగా పెట్టే ఖర్చు ఒక్కో రకంగా ఉంటుందన్నారు. నవోదయ విద్యాలయాల్లో ఒక్కోవిద్యార్థిపై 16 వేలు, ఏపీఆర్ స్కూళ్లలో సంవత్సరానికి 14వేలు, సెంట్రల్ స్కూల్లో 18వేలు, ప్రభుత్వ స్కూళ్లలో రూ. 1400 ఖర్చు పెడుతున్నాయని వెల్లడించారు. చదువు మూడో కన్నులాంటిదని, విద్య ద్వారానే మనకు జరిగే అన్యాయాన్ని తెలుసుకోవచ్చన్నారు. ప్రతి 1000 మందిలో 60 మంది బాలురు, 24 మంది బాలికలు పోషకాహార లోపంతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్ ఆహారభద్రతపై మాట్లాడుతూ ఒక మనిషికి సగటున 8,9 కిలోల బియ్యం నెలకు అవసరమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఆహార భద్రత ద్వారా ఒక వ్యక్తికి ఐదు కిలోలు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ధరలను నియంత్రించే స్థితిలో ప్రభుత్వాలు లేవన్నారు. అనంతరం మానవహక్కుల వేదిక ప్రణాళిక, కార్యవర్గ ఎంపికపై చర్చించారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా కార్యదర్శి బాదావత్ రాజు, నాయకులు సాదు రాజేష్‌కుమార్, దడబోయిన రంజిత్‌కుమార్, పాలకుర్తి సత్యం, ప్రొఫెసర్ కాత్యాయనీవిద్మహే తదితరులు పాల్గొన్నారు. -
అవమానభారంతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య
పినపాక న్యూస్‌లైన్ : అవమానభారంతో ఫొటో గ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని భట్టుపల్లిలో చోటు చేసుకుంది. కరకగూడెం ఎస్సై మాచర్ల అరుణ్‌కుమార్ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని భట్టుపల్లికి చెంది న శివరాత్రి వీరస్వామి(35) గ్రామంలో ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. అతని ఇంటి పక్కనే ఉంటున్న పోగు రాములు కుటుంబానికి అతనికి మధ్య శుక్రవారం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటి వద్ద మహిళల కారణంగా ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో రాములు తన సోదరులతో కలిసి వీరస్వామిపై దాడి చేసి గాయపరిచాడు. అందరి ముందు ఈ దాడి జరగడంతో మనస్తాపానికి గురైన వీరస్వామి శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకున్న పోలీసులు ఘర్షణకు పాల్పడిన పోగు రాములు అతని భార్య లలిత, దాడికి సహకరించిన పోగు వెంకటయ్య, లక్ష్మినర్సు, సత్తెమ్మ, లక్ష్మిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.