![Dussehra special trains via Vijayawada Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/29/train-3.jpg.webp?itok=0mejtLHc)
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) అదే 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రైలు జనగాం, ఖాజీపేట, వరంగల్లు, మహబూబ్‌నగర్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్–యశ్వంతపూర్ (07233) రైలు ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో సాయంత్రం 3.50 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
నరసాపూర్ –సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు కేటాయింపు
నరసాపూర్–సికింద్రాబాద్–నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు సీనియర్ డీసీఎం ఆంజనేయులు పేర్కొన్నారు. నరసాపూర్ – సికింద్రాబాద్ (07466) రైలు ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ –నరసాపూర్ (07467 ) రైలు అక్టోబరు 1న సికింద్రాబాద్‌లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి నరసాపూర్ స్టేషన్‌కు మరుసటిరోజు ఉదయం 8.35 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment