రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్–కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్(07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని పేర్కొన్నారు.
సికింద్రాబాద్–కొల్లాం (07121) ఈ నెల 27, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొల్లాం (07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వివరించారు.
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
Published Fri, Nov 11 2022 5:31 AM | Last Updated on Fri, Nov 11 2022 8:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment