
ఫౌంటెయిన్లు, పిల్లల కోసం ఆటస్థలాలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సరికొత్త హంగులు సంతరించుకోనుంది. స్టేషన్ రీమోడలింగ్‌లో భాగంగా పలు మార్పు లకు దక్షిణమధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సికిం ద్రాబాద్‌ను వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలనే ఒకప్పటి ప్రతిపాదన స్థానంలో తాజాగా రీమోడలింగ్ అంశం తెరపైకి వచ్చిం ది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్‌లో అదనపు సదుపాయాల ఏర్పాటు, కేటరింగ్ సేవల్లో నాణ్యత పెంపు, వాణిజ్య కేంద్రాల విస్తరణ, రెస్టారెంట్‌లు, షాపింగ్ సెంటర్లవంటి అదనపు హంగులతో రైల్వేస్టేషన్ సేవలను విస్తరించ నున్నారు. టికెట్‌తో పాటు టికెట్టేతర ఆదాయం పెంచుకొనేందుకు అనుగుణంగా రీమోడలింగ్ పనులు చేపట్టనున్నారు.
టికెట్టేతర ఆదాయమే లక్ష్యం...
సుమారు 200 రైళ్లు, 2.5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.750 నుంచి రూ.800 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఇందులో 80 శాతానికి పైగా టికెట్ విక్రయా లపైనే వస్తోంది. లక్షలాది మంది రాక పోకలు సాగించే ఏ-1 స్టేషన్‌లో టిక్కెట్టేతర ఆదాయం తక్కువగా ఉండడంపై అధికా రులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వినియో గదారులను ఆకట్టుకొనేలా స్టేషన్‌కు అదనపు హంగులు సమకూర్చాలని నిర్ణరుుంచారు. వరల్డ్ క్లాస్ అంశంపై నెలకొన్న పీటముడి కూడా తొలగిపోవడంతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్‌లు వంటివి ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పెంచు కొనేందుకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై పెద్ద రెస్టారెంట్‌ను ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌కు రెండు వైపులా పార్కింగ్ సదుపాయాలను మెరుపర్చేందుకు చర్యలు తీసుకుంటారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను స్టేషన్ బయటి వైపునకు పొడి గిస్తారు. తద్వారా చిలకల గూడ వైపు ఉన్న 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు ప్రయా ణికులు నేరుగా రాకపోకలు సాగించేం దుకు అవకాశం లభిస్తుంది.
ఆహ్లాదకరమైన వాతావరణం...
స్టేషన్‌లో ప్రయాణికులు వారి కోసం వచ్చే బంధుమిత్రులు సేద తీరేందుకు... అనువైన చోట పచ్చికల ఏర్పాటు వంటి ఆహ్లాదకరమైన సౌకర్యాలు కల్పిస్తారు. రెండు వైపులా ఫౌంటెరుున్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే షాపింగ్ కోసం వచ్చే వారు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలాలను కూడా రూపొందించాలనే ప్రతిపాదన కూడా ఉంది. బడా షాపింగ్ మాల్స్‌లో మాదిరిగానే... పిల్లలు ఆడుకొనేందుకు ఏర్పాట్లు చేస్తారు.
వరల్డ్ క్లాస్ లేనట్లే...
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్ర బిందువుగా ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై పెరుగుతున్న రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని 2008లోనే అంతర్జా తీయ ప్రమాణాలకు అనుగుణంగా అభి వృద్ధి చేయాలని ప్రతిపాదించారు. సుమా రు రూ.500 కోట్ల అంచనాలతో వరల్డ్‌క్లాస్ స్టేషన్ అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. కానీ భారీ బడ్జెట్‌తో కూడిన ఈ ప్రాజెక్టుపై రైల్వే వెనుకడుగు వేసింది. వరుసగా బడ్జెట్‌లలో ప్రతిపాదించినప్ప టికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా ప్రణాళికలను రూపొందిస్తున్న క్రమంలోనే రీమోడలింగ్‌కు రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు.