మృత్యు దారులు
పదేళ్లుగా ఇంతే..!
విజయనగరం కంటోన్మెంట్/టౌన్: విజయనగరం డివిజన్ పరిధిలో సుమా రు 15 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఒక లైన్‌లో నెల్లిమర్ల, చీపురుపల్లి, గరివిడి, పొందూరు, మరోలైన్‌లో కోరుకొండ, అలమండ, కంటకాప ల్లి, పెందుర్తి, కొత్తవలస, గొట్లాం, గజపతినగరం, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, బెల గాం, పార్వతీపురం మీదుగా రైళ్ల రాకపోకలకు విజయనగరం ప్రధాన జంక్షన్‌గా ఉంది. ఈ మార్గంలో ప్రతి రోజూ సుమారు 100 గూడ్స్, ప్రయాణికుల రైళ్లు రాకపోకలు చేస్తుంటా యి. ఈ రీజియన్ పరిధిలో 50కి పైగానే నాన్‌మెన్ లెవెల్ క్రాసిం గ్‌లున్నాయి. వీటికి సంబంధిం చి ఎక్కడా హెచ్చరిక బోర్డులు కాని, సూచికలు గాని లేవు. విజయనగరంలో వీటీ అగ్రహా రం, బీసీ కాలనీల్లోకి వెళ్లాలంటే రైల్వే ట్రాకు దాటుకుని వెళ్లాలి. ఇక్కడ పదేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నా.. పాలకు లు పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఇక్కడ 800 మందికిపైగా మృతి చెందారు.
టన్నెల్స్ నిర్మాణాలతోనే పరిష్కారం!
సాధారణంగా అన్‌మేన్డ్ లెవెల్ క్రాసింగ్‌లున్న చోట రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది.అయితే ఇక్కడ బ్రిడ్జిలు నిర్మిం చాలంటే భారీ వ్యయంతో కూడి న పని. ఈ నేపథ్యంలో భూగర్భం లోంచి వెళ్లేలా కాంక్రీటు టన్నెల్ నిర్మాణాలు (క్యూబ్స్)చేపడితే ప్రయోజనాలు కనిపి స్తాయి. పలు ప్రాంతాల్లో వీటిని నిర్మాణాలు చేస్తున్నప్పటికీ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. (లేకపోతే ఈ నిర్మాణాలు వృథావుతాయి). జిల్లాలో డొం కినవలస రైల్వేస్టేషన్‌లో ఈ తరహా నిర్మాణాన్ని రెండేళ్ల క్రితం చేపట్టినప్పటికీ దీని వినియోగం లేక లక్షలాది రూపాయలు వృథాఅయ్యాయి.
లెవెల్ క్రాసింగ్ అంటే ...
లెవెల్ క్రాసింగ్ లో మేన్డ్, అన్‌మేన్డ్ రెం డు రకాలుంటాయి. ఇందులో కొన్ని స్టేషన్‌మాస్టర్ కంట్రోల్‌తో ఉన్న ఆటోమేటిక్ సిస్టమ్‌తోనూ, మరి కొన్ని సిగ్నల్ సమాచారం ద్వారా అప్రమత్తమయ్యే విధానంలో పని చేస్తాయి. ఈ రెం డూ లేని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా యి. సిగ్నల్స్‌తో సంబంధం ఉన్న రైళ్ల రాకపోకలకు టెలిఫోన్ ద్వారా సమాచారమందిస్తారు. దీనికి సంబంధించి ముందు స్టేషన్‌మాస్టర్ కోడ్ పాస్ చేస్తారు. కోడ్ పాసైన వెంటనే సిగ్నల్ వేయడం... అదే సమయంలో గేటు పడడం జరుగుతాయి. ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చాక ముం దు స్టేషన్ నుంచి నేరుగా మానిటర్‌లోనే రైల్ వస్తున్న స మాచారం తెలుస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా కేబిన్‌లోనే లాక్ పడి గేటు వేస్తారు. ఇక్కడి నుంచి రె ల్ బయలు దేరిన వెంటనే మానిటర్‌లో అన్‌లాక్ సిగ్నల్ కనిపిస్తుంది. వెంటనే సిబ్బంది గేటు ఎత్తేస్తారు.
ప్రాణాలు హరిస్తున్న రైల్వే క్రాసింగ్‌లు
బొబ్బిలి/ రూరల్: బొబ్బిలి పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న గున్నతోటవలస రైల్వే క్రాసింగ్ వద్ద గేటు లేదు. ఏడాది కిందట ఇక్కడ ఆటోను రైలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడేదుర్మరణం పాలయ్యారు. బాడంగి మండలానికి చెందిన ఓ ద్విచక్ర వాహనచోదకుడు రైలు ఢీకొని ఛిద్రం అయ్యారు. ఈ ఏడాదిలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా.. అధికారు లు మాత్రం గేటు ఏర్పాటుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.బొబ్బిలి పట్టణంలో డబుల్ రైలు గేటు వల్ల ఏదైనా ఇబ్బందులుంటే వాహనచోదకులు ఇలాగే ప్రయాణం సాగించి ఇటు విశాఖ రోడ్డుకు, అటు బొబ్బిలి పట్టణానికి చేరుకుంటా రు.
పట్టణంలో రాస్తారోకోలు, ఆందోళనలు జరిగి ట్రాఫిక్ నిలిచిపోయినా.. వాహనాల రాకపోకలకు ఇదే ప్రత్యామ్నాయ రహదారి. అయితే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించిన అధికారులు రెండేళ్ల క్రితం ఇక్కడ గేటు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటికీ ఈ పనులు కొనసాగుతూ...నే ఉన్నాయి. బాడంగి రైల్వేస్టేషన్ ముందు డొంకినవలస వెళ్లడానికి ముందు కూడా ఇలాంటి లెవెల్ క్రాసింగే ఉంది. అక్కడ గేటు, కాపలాదారు లేకపోవడంతో రెండేళ్ల కిందట ఏకంగా గ్యాస్ సిలిండర్ల లారీనే రైలు ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు అవి పేలకుండా చెరువులో పడి పోయాయి. లేకపోతే పెనుప్రమాదమే జరిగేది.
ఇక బొబ్బిలి-సీతానగరం రైల్వే గేట్లు మధ్య ఆర్. వెంకంపేట గ్రామ సమీపంలో కూడా ఇటువంటి క్రాసింగులు రెం డు ఉన్నాయి. వాటి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థాని కులు భయూందోళన చెందుతున్నారు. బొబ్బిలి నుంచి సాలూరు వెళ్లే రైల్‌బస్సు మార్గంలో కూడా ఎక్కడా రైల్వే గేట్లు లే వు. ఈ మార్గంలో బొబ్బిలి, సాలూరు, రామభద్రపురం మండలాలు ఉన్నాయి. వ్యవసాయూనికి దారులు, విద్యార్థులు, పలు గ్రామాల ప్రజ లు నిత్యం పట్టాలు దాటి రాకపోకలు చేస్తుం టారు. అయితే ఈ మార్గంలో ఎక్కడా గేట్లు ఏ ర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందో తెలియని పరిస్థితి నెల కొంది. అలాగే బొబ్బిలి మండలంలోని నారాయణప్పవలస, కాశిందొరవలస గ్రామాల్లోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.