విజయనగరం రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి కలకలం
శనివారం అర్ధరాత్రి 1.03 గంటలు. విజయనగరం రైల్వేస్టేషన్‌లోకి పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆగింది. ఇంతలో ఏదో అలజడి. చూస్తే ఎస్-3 కోచ్ నుంచి పొగలు వచ్చాయి. ప్రయూణికులంతా రైలు కోచ్‌ల నుంచి ప్లాట్‌ఫారంపైకి పరుగులు తీశారు. గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తమయ్యూరు. ఇంతలోనే ఓ వ్యక్తి తమకు భద్రత లేదంటూ హల్‌చల్ చేశాడు. ఉన్నతాధికారులు రావాలని డిమాండ్ చేశాడు. రంగంలోకి దిగిన ఆర్‌పీఎఫ్ బలగాలు రైలు గమనం నిరోధం చట్టం కింద ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మొత్తంగా స్టేషన్‌లో పూరీ- అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల 12 నిమిషాల పాటు నిలిచిపోయింది. తరువాత 3.15 గంటలకు రైలు బయలుదేరింది. సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు, అధికారులు, ప్రయూణికులు అందించిన వివరాల ప్రకారం...
విజయనగరం టౌన్ : విజయనగరం రైల్వేస్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒకటో నంబరు ప్లాట్‌ఫారంలో 12.15 గంటలకు రావాల్సిన రైలు నంబరు 12843 పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ కొంత ఆల స్యంగా 1.03 గంటలకు వచ్చింది. రైల్వే సిబ్బంది ఇంజిన్ ను ఇక్కడ మార్పు చేశారు. కొద్ది నిమిషాల్లో రైలు బయలు దేరుతుందనగా ఎస్-3 కోచ్ పక్కన ఉన్న మెషీన్ నుంచి చిన్నపాటి పొగలు వచ్చి ఆ భోగికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అంతే ప్రయూణికుల్లో కలకలం రేగింది.
వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆన్ డ్యూటీ రన్నింగ్ స్టాఫ్‌తో పరిస్థితిని చక్కదిద్దారు. చిన్న వైరు లూజు కావడంతో పొగలు వచ్చాయని రైల్లో ఆన్‌డ్యూటీ స్టాఫ్ ఉన్నారని అధికారులు చెప్పినా ఓ వ్యక్తి ఈ సంఘటనపై హల్‌చల్ చేశాడు. రైలు వెళ్లే సమయం ఆలస్యమైతే తీవ్ర ఇబ్బందులు ఉంటాయని డ్యూటీ అధికారులు చెప్పినా వినకుండా తోటి ప్రయూణికులతో హడావుడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ సమయంలో వచ్చిన ప్రతీ అధికారిని నువ్వు అధికారివా... డ్యూటీ చేస్తున్నావా... నీ ఐడీ కార్డు చూపించు.. నువ్వు అహ్మదాబాద్ వరకు వస్తావా... మా ప్రాణాలంటే అలుసా.. అంటూ అధికారులపై మండిపడ్డాడు.
ప్రతి స్టేషన్‌లోనూ అధికారులను అప్రమత్తం చేశామని, ఎక్కడా ఎటువంటి లోపం రాదని ఆన్‌డ్యూటీ స్టాఫ్ సర్టిఫై చేశారని రైల్వే సిబ్బంది చెప్పినా వినకుండా స్టేషన్ మేనేజర్‌తో పాటు ఉన్నతాధికారులు స్పాట్‌లో ఉండాలంటూ గందరగోళం సృష్టిం చాడు. చేసేది లేక ఆఫీసర్ క్యాడర్ స్థారుు వారు కూడా స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే రెండు గంటల ఆల స్యం కావడంతో ఆర్‌పీఎఫ్ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. కొందరు మహిళా ప్రయూణికులు ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ రామకృష్ణ వద్దకు వచ్చి ఒక్కడి వల్ల రైలు ఇంతసేపు ఆపేశారని, రైలు బయలుదేరకుంటే తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వారంతా చెప్పినా ఆ వ్యక్తి వినకపోవడంతో ఉన్నతాధికారులతో సంప్రదించి ఆర్‌పీఎఫ్‌కి కేసును అప్పగించారు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసుల సహకారంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్‌పీఎఫ్ సెల్‌లో ఉంచారు. దీంతో పరిస్థితి సద్దుమణి గి ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు రైలును పంపించారు.
ఈ-టికెట్ కన్‌ఫర్మ్ కాలేదు...
రైల్వేస్టేషన్‌లో అలజడి సృష్టించిన వ్యక్తి విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్ బయలుదేరేందుకు వచ్చిన విజయనగరానికి చెందిన రామ్‌లాల్వానీగా గుర్తించామని ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ రామకృష్ణ చెప్పారు. ఈయన తీసిన ఈ టికెట్ కన్‌ఫర్మ్ కాలేదన్నారు. పైగా ప్లాట్‌ఫాం టికెట్ కూడా ఆయన వద్ద లేదని తెలిపారు. ఆయనకు తోడుగా మరో వ్యక్తి కూడా ఉన్నారని ఆయన ను కూడా విచారిస్తున్నామని చెప్పారు. రైలు గమనాన్ని నిరోధించే చట్టం కింద అతడిపై కేసులు నమోదు చేశామని, దీనిపై ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. రైల్వే యూక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.