విజయనగరం టౌన్: ఎంత మందిని ‘అయ్యా ఆకలేస్తోంది..’ అని అడగాలనుకున్నాడో... ఎంత మందిని ‘అమ్మా దాహంగా ఉంది గుక్కెడు నీరివ్వండి’ అని వేడుకోవాలనుకున్నాడో గానీ ఆ వృద్ధుడు ఎవరినీ ఏమీ అడగలేక, ఈ పాడు లోకంలో ఇమడలేక కన్ను మూశాడు. తన బతుకులో ఎన్నిసార్లు నిరాదరణకు గురయ్యాడో గానీ బతుకు పోయిన తర్వాత కూడా అదే నిరాదణకు గురయ్యాడు. సుమారు వంద మందికి పైగా రైల్వే అధికారులు నిత్యం రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఏ ఒక్కరికీ ఈ వృద్ధుడిపై దయ కలగలేదేమో... చివరికి వృద్ధుడు నిరాదరణకు గురై ప్రాణాలను కోల్పోయాడు.
ఉదయం 9 గంటల సమయం రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఐదో నంబర్ ఫ్లాట్‌ఫాంపై ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తున్నాయి, వస్తున్నాయి. ఎందరో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆత్రుతగా ఉన్నారు. అయితే అదే ప్లాట్‌ఫారంపై ఓ వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. నాలుగురోజులుగా ఆ వృద్ధుడు అక్కడ అదేవిధంగా పడుకున్నట్లు చూసిన వారంతా చెబుతున్నారు. ఏ అర్ధరాత్రో అతడు మృతి చెంది ఉంటాడని పలువురు అంటున్నారు. అయితే చూసేవారంతా అయ్యోపాపం అన్న వారే తప్ప ఎవరూ పట్టించుకోలేదు. నాలుగురోజులుగా ఆ వృద్ధుడు అక్కడే పడుకుని ఉన్నాడని క్యాంటీన్ వర్కర్స్, స్వీపర్లు చెబుతున్నారు.
అయితే రెగ్యులర్‌గా విధులు నిర్వహించే ఆర్‌పీఎఫ్‌లు, జీఆర్ పీ పోలీసులు ఉన్నా ఆ వృద్ధుడికి ఎవరూ సాయం చేయలేకపోయారు. రైల్వే స్టేషన్‌లో మృతదేహం ఉంటే ఎవరికి సమాచారం అందించాలో తెలియక ప్రయాణికులు కూడా సందిగ్ధంలో పడ్డారు. అయితే రైల్వేస్టేషన్ ఆవరణలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించి రైల్వే ఉద్యోగి పేరు నమోదుచేసుకుని, క్లైయిమ్ కోసం అతన్ని హైదరాబాద్ వరకూ కోర్టుకు పిలుస్తారని, అందువల్లే తాముఎవరికీ చెప్పలేకపోతున్నామని, ఇన్‌ఫర్మేషన్ ఇద్దామనుకున్నా తా ము కోర్టుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉంటుందని భావించి చెప్పలేకపోతున్నామని పలువురు రైల్వే సి బ్బంది వాపోతున్నారు.108కి సమాచారం ఇచ్చేవిధం గా, రైల్వే అధికారులు సమాచారకేంద్రాన్ని ఉంచే వి ధంగా ఏర్పాట్లు చేయాలని రైలు ప్రయాణికులు కోరుతున్నారు. అయితే రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని ఖననం చేసినట్లు తెలిపారు.
మానవత్వమా... నీవెక్కడా?
Published Wed, Jul 23 2014 1:05 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
Advertisement
Advertisement