
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్‌లోని తాడి–అనకాపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో గూడ్స్‌రైలు పట్టలు తప్పడం ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నింటిని నేడు (16న), కొన్నింటిని నేడు, రేపు (16, 17 తేదీల్లో) రద్దుచేసినట్లు ప్రకటించారు.
నేడు రద్దయిన రైళ్లు
విజయవాడ–విశాఖపట్న(12718/12717), విశాఖపట్నం–కడప (17488), హైదరాబాద్–విశాఖపట్నం (12728), విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (12861), సికింద్రాబాద్–విశాఖపట్నం (12740), విశాఖపట్నం–తిరుపతి (22708), గుంటూరు–రాయగడ (17243).
నేడు, రేపు రద్దయిన రైళ్లు
కడప–విశాఖపట్నం (17487), విశాఖపట్నం–హైదరాబాద్ (12727), మహబూబ్‌నగర్–విశాఖపట్నం (12862), విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739), రాయగడ– గుంటూరు (17244).
Comments
Please login to add a commentAdd a comment