రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): వరద తీవ్రత తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు స్టేషన్ పరిధిలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి పలు రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఆయా రైళ్లకు రాయపాడులో స్టాపేజీని తొలగించి నిర్దేశించిన ట్రాక్‌లపై నడుపుతున్నారు.
విశాఖపట్నం–హైదరాబాద్ (12727), విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (12861), విశాఖపట్నం–నాందేడ్ (20811), తిరుపతి– సికింద్రాబాద్ (12763), గూడూరు– సికింద్రాబాద్ (12709), తాంబరం– హైదరాబాద్ (12759), యశ్వంత్‌పూర్–లక్నో (12539), చెన్నై సెంట్రల్–న్యూఢిల్లీ (12621), పుదుచ్చేరి– న్యూఢిల్లీ (22403), కొచ్చువెల్లి–గోరఖ్‌పూర్ (12512), విశాఖపట్నం–ఎల్‌టీటీ ముంబై (18519), విశాఖపట్నం–సాయినగర్ షిర్డీ (18503), షాలీమార్– హైదరాబాద్ (18045), షాలీమార్–సికింద్రాబాద్ (22849), బెంగళూరు–ధనాపూర్ (12295) రైళ్లను పునరుద్ధరించారు.
మల్దా టౌన్–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు
రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ మీదుగా మల్దా టౌన్–సికింద్రాబాద్ మధ్య ఎనిమిది ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. మల్దా టౌన్–సికింద్రాబాద్ (03430) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి మంగళవారం, సికింద్రాబాద్–మల్దాటౌన్ (03429) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి గురువారం నడుస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment