Vijayawada Division
-
25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని తడి–దువ్వాడ సెక్షన్ల మధ్యలో జరుగుతున్న నాన్ ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఈ నెల 25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటలో తెలిపారు.విజయవాడ–విశాఖపట్నం (12718/12717), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268), గుంటూరు–విశాఖపట్నం (17239/17240), రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. -
రాయనపాడు మీదుగా పలు రైళ్ల పునరుద్ధరణ
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): వరద తీవ్రత తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని రాయనపాడు స్టేషన్ పరిధిలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి పలు రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఆయా రైళ్లకు రాయపాడులో స్టాపేజీని తొలగించి నిర్దేశించిన ట్రాక్‌లపై నడుపుతున్నారు. విశాఖపట్నం–హైదరాబాద్ (12727), విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (12861), విశాఖపట్నం–నాందేడ్ (20811), తిరుపతి– సికింద్రాబాద్ (12763), గూడూరు– సికింద్రాబాద్ (12709), తాంబరం– హైదరాబాద్ (12759), యశ్వంత్‌పూర్–లక్నో (12539), చెన్నై సెంట్రల్–న్యూఢిల్లీ (12621), పుదుచ్చేరి– న్యూఢిల్లీ (22403), కొచ్చువెల్లి–గోరఖ్‌పూర్ (12512), విశాఖపట్నం–ఎల్టీటీ ముంబై (18519), విశాఖపట్నం–సాయినగర్ షిర్డీ (18503), షాలీమార్– హైదరాబాద్ (18045), షాలీమార్–సికింద్రాబాద్ (22849), బెంగళూరు–ధనాపూర్ (12295) రైళ్లను పునరుద్ధరించారు.మల్దా టౌన్–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లురానున్న దసరా, దీపావళి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ మీదుగా మల్దా టౌన్–సికింద్రాబాద్ మధ్య ఎనిమిది ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. మల్దా టౌన్–సికింద్రాబాద్ (03430) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి మంగళవారం, సికింద్రాబాద్–మల్దాటౌన్ (03429) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి గురువారం నడుస్తాయని తెలిపారు. -
వర్షాలతో నేడు, రేపు పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విజయవాడ డివిజన్లోని పలు సెక్షన్లలో ట్రాక్‌లపై వర్షం నీరు చేరడంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా శనివారం, ఆదివారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–గూడూరు (07500/07458), విజయవాడ–కాకినాడ పోర్టు (17257), తెనాలి–రేపల్లె (07874/07875), గుడివాడ–మచిలీపట్నం (07868/07869), భీమవరం జంక్షన్–నిడదవోలు (07885/07886), నర్సాపూర్–గుంటూరు (07281), గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269), ఒంగోలు–విజయవాడ (07576), విజయవాడ–మచిలీపట్నం (07898/07899), విజయవాడ–ఒంగోలు (07461), నర్సాపూర్–గుంటూరు (07281), గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269) రద్దు చేశారు. అదే విధంగా గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269) రైళ్లను సోమవారం కూడ రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వేశాఖ అనేక రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. దీంతో ప్రయాణికులకు ఆయా రైళ్ల సమాచారం తెలియజేసేందుకు అధికారులు ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.హెల్ప్‌లైన్ నంబర్లు విజయవాడ–7569305697, రాజమండ్రి–08832420541 తెనాలి–08644227600, తుని–7815909479 నెల్లూరు–7815909469, గూడూరు–08624250795 ఒంగోలు–7815909489, గుడివాడ–7815909462 భీమవరం టౌన్–7815909402 -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219), గుంటూరు–విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. దారి మళ్లింపు.. ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో భావ్‌నగర్ – కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఏప్రిల్ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11019), ఏప్రిల్ 1 నుంచి 28 వరకు ధనాబాద్ – అలప్పుజ (13351), ఏప్రిల్ 4, 11, 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్ – తాంబరం (12376), ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో హతియ – ఎర్నాకుళం (22837), ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), ఏప్రిల్ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (12835), ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో టాటా – బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
అన్నవరం రైల్వేస్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లోనే తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ సాధించింది. ఇది డివిజన్‌లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ (నాంపల్లి) తర్వాత రెండోదిగా నిలిచింది. ఈ సర్టిఫికెట్ సాధించేందుకు డివిజన్ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. ఆ స్టేషన్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్ యజమానులు, సరఫరాదారులకు ఎఫ్ఏఎస్టీఏసీ (ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్)లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కమర్షియల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి–పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించేవారు. ప్రారంభంలో ప్రీ–ఆడిట్ నిర్వహించి చివరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంతరం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ వరించింది. ఈ సర్టిఫికెట్ సాధించడానికి కృషిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓ మహ్మతుల్లా, ఇతర అధికారులను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని మనుబోలు–గూడూరు సెక్షన్లో నాన్–ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఈ నెల 10 నుంచి 15 వరకు ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేసి మరి కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రద్దయిన రైళ్లు: విజయవాడ–గూడూరు (07500/ 07458), సూళ్లురుపేట–నెల్లూరు (06745/06746, 06747/06748, 06750/06751), గూడూరు–రేణిగుంట (07667), మచిలీపట్నం–ధర్మవరం (07095/07096), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–గూడూరు (17260), చెన్నై సెంట్రల్–విజయవాడ (12077/12078), విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712), ధర్మవరం–నర్సాపూర్ (17248), తిరుపతి–కాకినాడ టౌన్(17249/17250) రైళ్లను ఈ నెల 10 నుంచి 15 వరకు, బెంగళూరు–హటియా (18637) ఈ నెల 12న, హటియా–ఒంగోలు (18238) ఈ నెల 15న, గయా–చెన్నై ఎగ్మూర్ (12389/12390), ఈ నెల 13,15న, తిరుపతి–విశాఖ (22708/22707) ఈ నెల 9, 10, 11, 12 తేదీలలోను, చెన్నై సెంట్రల్–విశాఖ (22869/22870) ఈ నెల 14, 15 తేదీల్లో పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దు: సికింద్రాబాద్–గూడూరు (12710/12709) రైలును ఈ నెల 9 నుంచి 14 వరకు వేదాయపాలెం–గూడూరు మధ్య, విజయవాడ–గూడూరు (12744/12743) రైలును ఈ నెల 11 నుంచి 15 వరకు నెల్లూరు–గూడూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్ళింపు: కాచీగూడ–మధురై (07191) ఈ నెల 14న డోన్, గుత్తి, రేణిగుంట మీదుగా, యర్నాకులం–హౌరా (22878) ఈ నెల 14న, మధురై–నిజాముద్దిన్ (12651) ఈ నెల 15న, బెంగళూరు–గౌహతి ఈ నెల 10, 11 తేదీల్లో కాటా్పడి, రేణిగుంట, నంద్యాల, గుంటూరు మీదుగా దారి మళ్ళించారు. -
ఏపీలో 11 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృధ్ధి పనులకు ఈ నెల 6న ప్రధాని మోదీవర్చువల్ పద్ధతిన శంకుస్థాపన చేయనున్నారని. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎమ్ నరేంద్ర ఆనందరావు పాటిల్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తొలిదశలో విజయవాడ డివిజన్లో రూ.270 కోట్లతో 11 రైల్వే స్టేషన్ల్లో పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రెండో దశలో మరో 9 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు వివరించారు. తొలి దశ పనుల్లో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్ల్లో పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఏబీఎస్ఎస్లో భాగంగా తెలంగాణలో తొలి దశలో 21 స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నారు. -
నేడు, రేపు విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని తాడి–అనకాపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో గూడ్స్‌రైలు పట్టలు తప్పడం ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నింటిని నేడు (16న), కొన్నింటిని నేడు, రేపు (16, 17 తేదీల్లో) రద్దుచేసినట్లు ప్రకటించారు. నేడు రద్దయిన రైళ్లు విజయవాడ–విశాఖపట్న(12718/12717), విశాఖపట్నం–కడప (17488), హైదరాబాద్–విశాఖపట్నం (12728), విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (12861), సికింద్రాబాద్–విశాఖపట్నం (12740), విశాఖపట్నం–తిరుపతి (22708), గుంటూరు–రాయగడ (17243). నేడు, రేపు రద్దయిన రైళ్లు కడప–విశాఖపట్నం (17487), విశాఖపట్నం–హైదరాబాద్ (12727), మహబూబ్‌నగర్–విశాఖపట్నం (12862), విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739), రాయగడ– గుంటూరు (17244). -
‘గతిశక్తి’ కార్యకలాపాలు ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని కృష్ణపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గతిశక్తి మల్టిమోడల్ కార్గో టెర్మినల్ నుంచి మొదటి సారిగా పీఓఎల్ (పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్) రేక్‌ను ప్రారంభించారు. 50 ట్యాంక్ వ్యాగన్లలో 2,693 టన్నుల పీఓఎల్‌ను రవాణా చేయడం ద్వారా డివిజన్ రూ.35.36 లక్షల ఆదాయం ఆర్జించింది. ఏప్రిల్ 26న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించగా సోమవారం తెల్లవారుజామున మొదటి రేక్‌ను చర్లపల్లిలోని బీపీసీఎల్‌కు పంపించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం షివేంద్రమోహన్ మాట్లాడుతూ సాంప్రదాయ సరుకు రవాణాతో పాటు వినూత్న ఆలోచనలతో సరుకు రవాణాను పెంచేందుకు గతిశక్తి మల్టిమోడల్ కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది విజయవాడ డివిజన్‌కే మరో మణిహారం అని కొనియాడారు. గతిశక్తి టెర్మినల్ నిర్వహణను ప్రారంభించడంలో కృషి చేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓఎమ్ డి.నరేంద్రవర్మను అభినందించారు. -
ఆర్చర్ సునెందురాయ్‌కు రెండు పతకాలు
విజయవాడ స్పోర్ట్స్ : బిలాస్పూర్లో ఈ నెల 25 నుంచి గురువారం వరకు జరిగిన ఆల్ ఇండియా రైల్వే ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో విజయవాడ డివిజన్‌కు చెందిన సునెందురాయ్ రెండు కాంస్య పతకాలు సాధించినట్లు డివిజనల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఎన్.అర్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా సునెందురాయ్ను డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ జె.ప్రదీప్‌కుమార్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ అభినందించారు. -
‘రైల్వే’కు రెండు సివిల్స్ ర్యాంకులు
అభినందనలు తెలిపిన జీఎం రవీంద్రగుప్త సాక్షి, హైదరాబాద్: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరు రైల్వే ఉద్యోగుల పిల్లలు మెరుగైన ర్యాంకులు సాధించారు. విజయవాడ డివిజన్ సిగ్నల్స్ విభాగంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కుమారుడు రామకృష్ణ జాతీయ స్థాయిలో 84వ ర్యాంకు, సికింద్రాబాద్ రైల్‌నిలయంలో వర్క్ స్టడీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న త్యాగరాజనాయుడు కుమారుడు విద్యాసాగర్ 101 వ ర్యాంకు సాధించారు. రామకృష్ణకు ఇది మూడోప్రయత్నం. 2013 తొలి ప్రయత్నంలో 257 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు అర్హతపొందాడు. ఐపీఎస్ శిక్షణ అనంతరం పశ్చిమబెంగాల్ కేడర్‌లో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మరోసారి పరీక్ష రాయగా 260 ర్యాంకుతో ఐఆర్ఎస్ సాధించారు. ఈసారి 84వ ర్యాంకుతో ఐఏఎస్ అవకాశాన్ని మెరుగుపరుచుకున్నారు. విద్యాసాగర్ రెండో ప్రయత్నంలో 101వ ర్యాంకు పొందారు. కాగా, క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరుస్తున్న రైల్వే ఇప్పుడు ఉన్నత చదువుల్లో కూడా సత్తా చాటడం పట్ల దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త హర్షం వ్యక్తం చేశారు. తాజా సివిల్స్ పరీక్షల్లో మెరుగైన ర్యాంకు పొందిన ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. -
ఎంపీల ప్రతిపాదనలు బుట్టదాఖలు
విజయవాడ : రైల్వే బడ్జెట్లో విజయవాడ డివిజన్‌కు నిధులు కేటాయించాలంటూ జనవరి ఆరో తేదీన జరిగిన సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవను బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కోరారు. కేశినేని నాని ప్రతిపాదనలివీ.. నూతన రాష్ట్ర రాజధానిగా విజయవాడ మారిన నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేసి అన్ని సౌకర్యాలూ కల్పించాలి. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైళ్ల సంఖ్య పెంచాలి. రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపును ఆధునికీకరించాలి. నగరంలోని రైల్వే ఆస్పత్రిని వెయ్యి పడకలకు విస్తరించి అభివృద్ధి చేయాలి. విజయవాడ నుంచి నడిచే ఒకరైలుకు ఇంద్రకీలాద్రి ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలి. విజయవాడ నుంచి ముంబయి, కొచ్చిన్, త్రివేండ్రం, సూరత్, గౌహతి, కోయంబత్తూర్‌కు రైళ్లు నడపాలి. గుణదల, వాంబేకాలనీతో పాటు విజయవాడలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు నిర్మించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి. కొనకళ్ల నారాయణ ప్రతిపాదనలివీ.. బందరు పోర్టు నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం కేంద్రంగా కోస్తా రైల్ కారిడార్‌ను ఏర్పాటుచేయాలి.బందరు నుంచి కోటిపల్లి, రేపల్లె రైల్వే లైన్లను విస్తరిస్తే భవిష్యత్తులో కోస్తా రైలు మార్గం కీలకంగా మారుతుంది. పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి కాబట్టి అందుకనుగుణంగా మచిలీపట్నం స్టేషన్‌ను అభివృద్ధిచేయాలి. మచిలీపట్నం-విజయవాడ రైల్వే లైను డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. బందరు నుంచి విశాఖపట్నం, తిరుపతికి నడుపుతున్న రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలి. నూజివీడులో మరిన్ని రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి. కొత్త రైళ్ల కేటాయింపులో మచిలీపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. వినూత్న బడ్జెట్ గత ప్రభుత్వాలు ప్రకటించిన ప్రాజెక్టులను పూర్తిచేసే ఉద్దేశంతో రైల్వేమంత్రి సురేష్ ప్రభు వినూత్నంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, టికెట్ బుకింగ్ దగ్గర నుంచి రైల్వే ప్రయాణం, గమ్యస్థానం చేరే వరకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాల మెరుగుదలే ధ్యేయంగా ఈ బడ్జెట్ ఉంది. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఏపీ ఎక్స్‌ప్రెస్, రైల్వే యూనివర్శిటీ, రైల్నీరు వంటి ప్రాజెక్టుల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తా. ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సిన ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తుందని నేను భావిస్తున్నాను. - కేశినేని నాని, విజయవాడ ఎంపీ -
కూతలా.. కోతలా!?
రైల్వే బడ్జెట్‌పై కోటి ఆశలు విజయవాడకు ప్రత్యేక కేటాయింపులు కావాలి ‘స్పెషల్’ రైళ్లు సకాలంలో నడిచేలా చూడాలి ప్లాట్‌ఫారాలపై నిలువ నీడ కల్పించండి ఏటా రైల్వే బడ్జెట్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విజయవాడ డివిజన్‌కు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారైనా కేటాయింపులు ఘనంగా ఉంటాయని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో విజయవాడ కీలకం కావడంతో ఈ డివిజన్‌కు కురిపించే వరాలపై రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పటిలా ఈసారీ కోతలు పెడతారా.. లేక కొత్త రైళ్లను మంజూరు చేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కూతలా.. కోతలా!? సాక్షి, విజయవాడ : ప్రత్యేక రైల్వే డివిజన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త రాజధాని ఏర్పాటు కావచ్చన్న వార్తల నేపథ్యంలో విజయవాడ డివిజన్ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడినుంచి దేశం నలుమూలలకు కొత్త రైళ్లు వేయాలని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లను ఏ-కేటగిరీగా అభివృద్ధి చేయాలంటూ ఇప్పటికే మన ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనేక సౌకర్యాలు రైల్వే బడ్జెట్లో మంజూరు కావాలని ప్రయాణికులు, రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. విజయవాడ, మచిలీపట్నం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కొత్త రైళ్లు ప్రారంభించాలి. విజయవాడ మీదుగా దూర ప్రాంతాలకు వెళుతున్న ప్రశాంతి, శేషాద్రి, యశ్వంత్‌పూర్, ఫలక్‌నుమా, నాగర్సోల్, మన్మాడ్, పాట్నా, కేరళ, జీటీ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో విజయవాడ ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్‌లో 100 బెర్త్‌లు, ఏసీలో 50 బెర్త్‌లు ప్రత్యేకంగా కేటాయించాలి. ప్రయాణికుల రద్దీ ఉన్నప్పుడల్లా విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి సకాలంలో నడిచేందుకు, రైళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు సరిగా ఉండే విధంగా బడ్జెట్లో తగిన చర్యలు తీసుకోవాలి. విజయవాడ జంక్షన్లో 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై పూర్తిగా షెడ్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండావానలకు ఇబ్బంది పడుతున్నారు. వీటి ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు మంజూరుచేయాలి. గుడివాడ, మచిలీపట్నం స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలి. విజయవాడ రైల్వే జంక్షన్‌ను అంతర్జాతీయ రైల్వేస్టేషన్ స్థాయికి పెంచాలి. విజయవాడ-మచిలీపట్నం మార్గం డబ్లింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలి. కోటిపల్లి-నర్సాపురం మార్గానికి నిధులు కేటాయించాలి. రైల్వేస్టేషన్లో నాణ్యమైన ఆహారం లభ్యమయ్యేలా చూడాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. రైల్వే ప్రయాణికుల భద్రత బాధ్యతల్ని ఆర్పీఎఫ్కు అప్పగించాలి. రైల్వే ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయాలి. తెనాలి-రేపల్లి-మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులను కలుపుతూ సర్క్యులర్ ట్రైన్ ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి దూర ప్రాం తాలకు వెళ్లే రైళ్లలో ఒక పార్సిల్ వ్యాన్‌ను ఏర్పాటుచేసుకోవాలి. రైల్వే ఇంజిన్లు మరమ్మతుకు గురైతే తమిళనాడు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడలోనే ఇంజిన్ మరమ్మతు ప్లాంట్ నెలకొల్పాలి. రైల్వే కోచ్‌లు మరమ్మతు చేసే లోకో షెడ్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలి. ఆశలు నెరవేరేనా.. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ వచ్చే ముందు ఈ ప్రాంత ప్రయాణికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. యూపీఏ సర్కారు అరకొర నిధులే మంజూరుచేసింది తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు. కనీసం ఎన్డీఏ ప్రభుత్వమైనా దక్షిణ మధ్య రైల్వేకు, విజయవాడ డివిజన్‌కు పెద్దపీట వేస్తుందో లేదో వేచిచూడాల్సిందే. -
ఎక్కడి రైళ్లు అక్కడే..
రైల్వే స్టేషన్ (రాజమండ్రి), న్యూస్‌లైన్ :వరద ఉధృతి కారణంగా రైలు పట్టాలు నీటమునగడంతో జిల్లాలోని వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి-యలమంచిలి రైళ్లు ల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో విశాఖపట్నం-రాజమండ్రి స్టేషన్ల మధ్య అనేక రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. రాజమండ్రిలో విశాఖ, తిరుమల, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేసి, ప్రయాణికులకు టికెట్ సొమ్మును వాపసు చేశారు. ప్రయాణికుల సౌకర్యార ్థం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, ఏడు ప్రత్యేక బస్సులను తుని వరకు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వైపు రావాల్సిన కొన్ని రైళ్లను బలార్షా, నాగ్‌పూర్ మీదుగా మళ్లించారు. జిల్లావ్యాప్తంగా అనేక స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లను షెడ్యూల్ ప్రకారం నడపడం కోసం తిరిగి వెనక్కి పంపే చర్యలను అధికారులు చేపట్టారు. రాజమండ్రి నుంచి తిరుమల, రత్నాచల్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్ణీత స్టేషన్లకు తరలించారు. తుని నుంచి గోదావరి, గరీబ్‌ర థ్, విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలుగా నడిపారు. విశాఖపట్నం వైపు రైళ్లు వెళ్లకపోవడంతో ఆర్ఆర్బీ రాతపరీక్షకు వెళ్లాల్సిన అభ్యర్థులు రాజమండ్రి స్టేషన్లో చిక్కుకుపోయారు. దెబ్బతిన్న ట్రాక్‌ను పరిశీలించేందుకు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ ప్రత్యేక రైలులో వచ్చారు. విండో ఇన్స్పెక్షన్ నిర్వహించి, ట్రాక్ దెబ్బతిన్న చోట పరిస్థితిని సమీక్షించారు. రైళ్లు రద్దు కావడంతో రాజమండ్రి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ెహ ల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం రాజమండ్రి రైల్వేస్టేషన్లో 1736 మంది ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను రద్దు చేసుకోగా, వారికి రూ.4,97,580 అధికారులు వాపసు చేశారు. జన్మభూమి, సింహాద్రి, భువనేశ్వర్, కొల్లాం రైళ్లు రద్దయ్యాయి. సికింద్రాబాద్-గౌహతి, హైదరాబాద్-హౌరా, ముంబై-భువనేశ్వర్, బొకా రో, హౌరా-యశ్వంత్‌పూర్, అమరావతి, ప్రశాంతి, వివేక్, త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లను బలార్షా, నాగపూర్ మీదుగా మళ్లించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో రైళ్లు నిలిచిపోవడంతో ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ పరిస్థితి సమీక్షించారు. -
విజయవాడ డివిజన్లో ట్రాక్‌పైకి నీరు చేరడంతో.. 17 రైళ్లు రద్దు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే వ్యవస్థపై తీవ్రప్రభావం చూపింది. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లతో పాటు విజయవాడ డివిజన్ గుండా ప్రయాణించే 17 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్లోని యలమంచిలి-నార్సింగంపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్‌పైకి వరద నీరు పొంగిప్రవహిస్తోంది. దీంతో ఆదివారం ఈ మార్గంలో నడిచే రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే గరీబ్‌రథ్, దురంతో, ఫలక్‌నుమా, గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపివేశారు. అలాగే తిరుపతి -విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు- విశాఖ ఎక్స్‌ప్రెస్, నాందేడ్- విశాఖ ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి - విశాఖ, విశాఖ-కాకినాడ ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు.