రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లోని పలు సెక్షన్‌లలో ట్రాక్‌లపై వర్షం నీరు చేరడంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా శనివారం, ఆదివారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.
విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–గూడూరు (07500/07458), విజయవాడ–కాకినాడ పోర్టు (17257), తెనాలి–రేపల్లె (07874/07875), గుడివాడ–మచిలీపట్నం (07868/07869), భీమవరం జంక్షన్–నిడదవోలు (07885/07886), నర్సాపూర్–గుంటూరు (07281), గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269), ఒంగోలు–విజయవాడ (07576), విజయవాడ–మచిలీపట్నం (07898/07899), విజయవాడ–ఒంగోలు (07461), నర్సాపూర్–గుంటూరు (07281), గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269) రద్దు చేశారు. అదే విధంగా గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269) రైళ్లను సోమవారం కూడ రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు
ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వేశాఖ అనేక రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. దీంతో ప్రయాణికులకు ఆయా రైళ్ల సమాచారం తెలియజేసేందుకు అధికారులు ముఖ్యమైన రైల్వేస్టేషన్‌లలో హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
హెల్ప్‌లైన్ నంబర్‌లు
విజయవాడ–7569305697, రాజమండ్రి–08832420541
తెనాలి–08644227600, తుని–7815909479
నెల్లూరు–7815909469, గూడూరు–08624250795
ఒంగోలు–7815909489, గుడివాడ–7815909462
భీమవరం టౌన్–7815909402
Comments
Please login to add a commentAdd a comment