విజయవాడ డివిజన్లో ట్రాక్పైకి నీరు చేరడంతో.. 17 రైళ్లు రద్దు | South Central Railway cancels 17 Trains due to overflowing of water on track | Sakshi
Sakshi News home page

విజయవాడ డివిజన్లో ట్రాక్పైకి నీరు చేరడంతో.. 17 రైళ్లు రద్దు

Published Sun, Oct 27 2013 5:06 PM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

విజయవాడ డివిజన్లో ట్రాక్పైకి నీరు చేరడంతో.. 17 రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్లో ట్రాక్పైకి నీరు చేరడంతో.. 17 రైళ్లు రద్దు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే వ్యవస్థపై తీవ్రప్రభావం చూపింది. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లతో పాటు విజయవాడ డివిజన్ గుండా ప్రయాణించే 17 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్లోని యలమంచిలి-నార్సింగంపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్పైకి వరద నీరు పొంగిప్రవహిస్తోంది. దీంతో ఆదివారం ఈ మార్గంలో నడిచే రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు.

సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే గరీబ్‌రథ్, దురంతో, ఫలక్‌నుమా, గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపివేశారు. అలాగే తిరుపతి -విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు- విశాఖ ఎక్స్‌ప్రెస్‌, నాందేడ్‌- విశాఖ ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి - విశాఖ, విశాఖ-కాకినాడ ప్యాసింజర్‌ రైళ్లను రద్దుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement