ఏపీలో 11 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి | Redevelopment of 11 railway stations in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 11 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి

Published Sat, Aug 5 2023 4:26 AM | Last Updated on Sat, Aug 5 2023 4:26 AM

Redevelopment of 11 railway stations in AP - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్‌ల పునరాభివృధ్ధి పనులకు ఈ నెల 6న ప్రధాని మోదీ­వర్చువల్‌ పద్ధతిన  శంకు­స్థాపన చేయనున్నారని. దక్షిణ మధ్య రైల్వే విజ­యవాడ డివిజన్‌ డీఆర్‌ఎమ్‌ నరేంద్ర ఆనందరావు పాటిల్‌ చెప్పా­రు. శుక్రవారం విజయవాడలో మీడి­యాతో మాట్లాడారు. తొలిదశ­లో విజయ­వాడ డివిజన్‌లో రూ.­270 కోట్లతో 11 రైల్వే స్టేషన్‌ల్లో పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పా­రు.

రెండో దశలో మరో 9 స్టేషన్‌ల పునరాభివృద్ధికి ప్రణాళికలు రూ­పొం­­దించనున్నట్లు వివరించారు. తొలి దశ పనుల్లో అనకాపల్లి, భీమవ­రం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సా­పూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్‌ల్లో పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపా­రు. ఏబీఎస్‌ఎస్‌లో భాగంగా తెలంగాణ­లో తొలి దశలో 21 స్టేషన్లను పునరా­భివృద్ధి చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement