ఎక్కడి రైళ్లు అక్కడే..
Published Mon, Oct 28 2013 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
రైల్వే స్టేషన్ (రాజమండ్రి), న్యూస్‌లైన్ :వరద ఉధృతి కారణంగా రైలు పట్టాలు నీటమునగడంతో జిల్లాలోని వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి-యలమంచిలి రైళ్లు ల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో విశాఖపట్నం-రాజమండ్రి స్టేషన్ల మధ్య అనేక రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. రాజమండ్రిలో విశాఖ, తిరుమల, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేసి, ప్రయాణికులకు టికెట్ సొమ్మును వాపసు చేశారు. ప్రయాణికుల సౌకర్యార ్థం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, ఏడు ప్రత్యేక బస్సులను తుని వరకు ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వైపు రావాల్సిన కొన్ని రైళ్లను బలార్షా, నాగ్‌పూర్ మీదుగా మళ్లించారు. జిల్లావ్యాప్తంగా అనేక స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లను షెడ్యూల్ ప్రకారం నడపడం కోసం తిరిగి వెనక్కి పంపే చర్యలను అధికారులు చేపట్టారు. రాజమండ్రి నుంచి తిరుమల, రత్నాచల్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్ణీత స్టేషన్లకు తరలించారు. తుని నుంచి గోదావరి, గరీబ్‌ర థ్, విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలుగా నడిపారు. విశాఖపట్నం వైపు రైళ్లు వెళ్లకపోవడంతో ఆర్‌ఆర్‌బీ రాతపరీక్షకు వెళ్లాల్సిన అభ్యర్థులు రాజమండ్రి స్టేషన్‌లో చిక్కుకుపోయారు.
దెబ్బతిన్న ట్రాక్‌ను పరిశీలించేందుకు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ ప్రత్యేక రైలులో వచ్చారు. విండో ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, ట్రాక్ దెబ్బతిన్న చోట పరిస్థితిని సమీక్షించారు. రైళ్లు రద్దు కావడంతో రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ెహ ల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో 1736 మంది ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను రద్దు చేసుకోగా, వారికి రూ.4,97,580 అధికారులు వాపసు చేశారు. జన్మభూమి, సింహాద్రి, భువనేశ్వర్, కొల్లాం రైళ్లు రద్దయ్యాయి. సికింద్రాబాద్-గౌహతి, హైదరాబాద్-హౌరా, ముంబై-భువనేశ్వర్, బొకా రో, హౌరా-యశ్వంత్‌పూర్, అమరావతి, ప్రశాంతి, వివేక్, త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లను బలార్షా, నాగపూర్ మీదుగా మళ్లించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో రైళ్లు నిలిచిపోవడంతో ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ పరిస్థితి సమీక్షించారు.
Advertisement