
ఫైల్‌ఫోటో
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా రైళ్లలో ఎలాంటి పేలుడు పదార్ధాలు తీసుకెళ్లరాదని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి సందర్భంగా టపాసులు, బాణాసంచా తీసుకెళ్లడం కూడా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అలాంటి ప్రయాణికులపైన రైల్వేయాక్ట్ –1989లోని సెక్షన్‌లు 164, 165 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఎవరైనా వ్యక్తులు రైళ్లలో టపాసులు, బాణా సంచా తీసుకెళ్తున్నట్లు అనుమానం వస్తే ప్రయాణికులు వెంటనే 182 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని కోరారు. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment