-రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో అత్యవసరంగా నిలిపివేత
ఘట్‌కేసర్ టౌన్
యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్ వెళ్లే టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో దాన్ని అధికారులు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ వద్ద నిలిపేశారు. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించగా ఎస్ 2, ఎస్ 3 రైలు బోగీల్లో బ్రేక్ లైనర్లు బిగుసుకోవడంతో పొగలు వచ్చినట్లు తేలింది.
బ్రేక్ లైనర్లు చల్లబడే వరకు స్టేషన్‌లో రైలును నిలిపిన అధికారులు సుమారు అరగంట తర్వాత పంపించారు. రైలును అత్యవసరంగా ఎందుకు నిలిపారో తెలియని ప్రయాణికులు ఆందోళన చెందారు. మెయిన్ ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ నిలపడంతో మిగతా రైళ్లను లూప్‌లైన్ ద్వారా కాజీపేట వైపు పంపించారు.