‘దురంతో’కు తప్పిన ప్రమాదం | 'Duronto' risk missed | Sakshi
Sakshi News home page

‘దురంతో’కు తప్పిన ప్రమాదం

Published Thu, Dec 22 2016 2:12 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

‘దురంతో’కు తప్పిన ప్రమాదం - Sakshi

‘దురంతో’కు తప్పిన ప్రమాదం

ఆమదాలవలస: శాంత్రగచ్చి– చెన్నై దురంతో ఎక్స్‌ప్రెస్‌కు బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో బుధవారం రైల్వే ట్రాక్‌ విరిగింది. అధికారులు సకాలంలో స్పందించి మరమ్మతులుS చేపట్టడంతో దురంతోకి ప్రమాదం తప్పింది.

రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం..ఉదయం 6.45 గంటలకు శాంత్రగచ్చి–చెన్నై (దురంతో ఎక్స్‌ప్రెస్‌) ప్లాట్‌ఫాం దాటిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ ఉన్న ప్రయాణికులు, అధికారులు పరిశీలించగా పట్టా విరిగి ఉండడాన్ని గమనించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై పట్టాకు మరమ్మతులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement