Vijayawada Special Train Services: కొనసాగనున్న ప్రత్యేక రైళ్లు - Sakshi
Sakshi News home page

కొనసాగనున్న ప్రత్యేక రైళ్లు

Published Sat, Jun 19 2021 8:39 AM | Last Updated on Sat, Jun 19 2021 11:00 AM

Special Train Services Are Continuing On Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యశ్వంత్‌పూర్‌–అహ్మదాబాద్‌ వారాంతపు రైళ్లు (06501/06502), యశ్వంత్‌పూర్‌–జయ్‌పూర్‌ వారాంతపు రైళ్లు (06521/06522), అజ్మీర్‌–బెంగళూర్‌ వారాంతపు రైళ్లు (06205/06206), బెంగళూర్‌–జోద్‌పూర్‌ వారాంతపు రైళ్లు (06533/06534), యశ్వంత్‌పూర్‌–ఢిల్లీ వారాంతపు రైళ్లు (06593/06594) యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు.

‘సికింద్రాబాద్‌–అగర్తల’ ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్‌–అగర్తలా మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలు(07029) ఈ నెల 18, 25 తేదీలలో ప్రతి శుక్రవారం ఉదయం 6.10 గంటలకు అగర్తలలో బయలుదేరి, రెండో రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (07030) ఈ నెల 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం మధ్యాహ్నం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగర్తలా చేరుకుంటుంది.
చదవండి: 350 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు వేగవంతం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement