
లండన్ : అవినీతి అధికారులపై చర్యలు చేపట్టడం ద్వారా అధికారులకు సరైన సంకేతాలు పంపుతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అవినీతి అధికారుల ప్రొఫైల్స్‌ను తమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులకు సరైన సంకేతాలు పంపే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ కళంకిత అధికారుల ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తోందని చెప్పారు.
ఇండియా డే కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు గోయల్ బ్రిటన్ చేరుకున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 15 మంది పరోక్ష పన్నుల విభాగానికి చెందిన సీనియర్ అధికారులచే పదవీ విరమణ చేయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment