నేడు సెఫ్టీ అధికారుల సమీక్ష
రైల్వేలైన్‌ను పరిశీలించనున్న అధికారులు
కర్నూలు: ఎట్టకేలకు నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేలైన్ సిద్ధమైంది. దశాబ్ద కాలం నుంచి వేచిచూస్తున్న నంద్యాల ప్రజల కల నెరవేరింది. మంగళవారం నిర్వహించే సెఫ్టీ అధికారులు సమీక్ష, లైన్ పరిశీలనతో లైన్ క్లియర్ కానుం ది. పెండేకంటి వెంకటసుబ్బయ్య గవర్నర్‌గా ఉన్న సమయంలో 1970లో నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేను ప్రతి పాదించారు. 1980 సర్వే చేపట్టగా 1990 మేలో పనులు చేపట్టారు. 185 కిలో మీటర్లల మార్గంలో నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు రైలు వెళ్లి అక్కడి నుండి తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందు కోసం సుమారు రూ. 450 కోట్లు వ్యయం చేశారు. విడతల వారీగా నిధులు ఇస్తూ ఎట్టకేలకు పనులు పూర్తి చేశారు.
ఎంతో మందికి ప్రయోజనం : నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే ఈ రైల్వే లైన్ ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చనుంది. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ప్రజలకు నెరవేరింది.నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాల ప్రజలు ఈ మార్గం ద్వారా తిరుపతికి రైలు ద్వారా వెళ్లే వెసలు బాటు కలుగుతుంది. నంద్యాల, మద్దూరు, కొత్తూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, నొన్సం, జమ్మలమడుగు మీదుగా ఎర్రగుంట్లకు చేరుతుంది.
సెఫ్టీ రన్‌తో రైళ్ల రాకపోకలు: నంద్యాల - ఎర్రగుంట్ల మీదుగా రైల్వేశాఖ అధికారులు సేఫ్టీరన్ చేపట్టనున్నారు. పట్టాల పటిష్టతను పరిశీలించిన అనంతరం రైలు నడుపుతారు. గుంతకల్ డివిజన్‌కు చెందిన అధికారులు పరిశీలించిన తర్వాత మూడు నెలల తర్వాత నుంచి నిరంతరం రైళ్ల రాకపోకలను చేపడుతారు.
నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ సిద్ధం
Published Tue, Jun 21 2016 8:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement