Nandyal - erraguntla railway line
-
Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల
బనగానపల్లె (నంద్యాల జిల్లా): రేనాటి ప్రాంత వాసుల కల నెరవేరుతోంది. త్వరలోనే విద్యుత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. నంద్యాల, ఎర్రగుంట్ల మధ్య 126 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ పనులను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. రూ.250 కోట్లతో ఈ పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి, దక్షిణ మధ్య రైల్వేకు అప్పగించారు. గత నెల 29వ తేదీన రైల్వే సేఫ్టీ అధికారి అభయకుమార్ రాయ్ ఆధ్వర్యంలో ట్రైల్ రన్ నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజన్ ఇంజినీర్ సంజీవకుమార్ బృందం కూడా శుక్రవారం రెండోసారి ట్రైల్ రన్ నిర్వహించింది. అతి త్వరలో విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి నంద్యాల, ఎర్రగుంట్ల విద్యుత్ రైల్వే లైన్ పూర్తికావడంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ లైన్లో గూడ్స్ సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉంది. దీంతో రేనాటి గడ్డ పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. రేనాటి గడ్డలో పలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గనుల నుంచి నాపరాతిని, ఫ్యాక్టరీల నుంచి పాలిష్ రాళ్లను ఇతర ప్రాంతాలను ఎగుమతి చేస్తున్నారు. గూడ్స్ సర్వీసులు పెరిగితే ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందనున్నాయి. పలువురికి ఉపాధి లభించనుంది. పెరగనున్న రైలు సర్వీసులు కరోనాతో ప్రస్తుతం ఈ మార్గంలో డెమో రైలు సేవలు రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ మాత్రమే నడుస్తోంది. విద్యుత్ లైన్ పూర్తికావడంతో డెమో రైల్‌తో పాటు మరిన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2016లో రైల్వేలైన్ ప్రారంభ సమయంలో నంద్యాల నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్ సర్వీస్ నడుపుతామని అధికారులు ఇచ్చిన హామీ ఇంత వరకు నేరవేరలేదు. హామీ నెరవేర్చాలని ఎంపీలు అవినాష్‌రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సర్వీస్‌ను నడిపేందుకు రైల్వే అధికారులు తప్పక చర్యలు తీసుకునే అకాశం ఉంది. త్వరలోనే విద్యుత్ రైళ్ల రాకపోకలు నంద్యాల, ఎర్రగుంట్ల రైలు మార్గం గుండా గూడ్స్ సర్వీస్‌లు విద్యుత్ సౌకర్యంతోనే నడుస్తున్నాయి. అనుకు న్న సమయానికన్నా ముందే విద్యుత్ లైన్ పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో ఈ మార్గం ద్వారా విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. రైళ్ల సర్వీసులు కూడా పెరిగే అవకాశం ఉంది. – సంజీవకుమార్, సీనియర్ డివిజనల్ ఇంజినీర్, దక్షిణ మధ్య రైల్వే -
నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ సిద్ధం
నేడు సెఫ్టీ అధికారుల సమీక్ష రైల్వేలైన్‌ను పరిశీలించనున్న అధికారులు కర్నూలు: ఎట్టకేలకు నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేలైన్ సిద్ధమైంది. దశాబ్ద కాలం నుంచి వేచిచూస్తున్న నంద్యాల ప్రజల కల నెరవేరింది. మంగళవారం నిర్వహించే సెఫ్టీ అధికారులు సమీక్ష, లైన్ పరిశీలనతో లైన్ క్లియర్ కానుం ది. పెండేకంటి వెంకటసుబ్బయ్య గవర్నర్‌గా ఉన్న సమయంలో 1970లో నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేను ప్రతి పాదించారు. 1980 సర్వే చేపట్టగా 1990 మేలో పనులు చేపట్టారు. 185 కిలో మీటర్లల మార్గంలో నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు రైలు వెళ్లి అక్కడి నుండి తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందు కోసం సుమారు రూ. 450 కోట్లు వ్యయం చేశారు. విడతల వారీగా నిధులు ఇస్తూ ఎట్టకేలకు పనులు పూర్తి చేశారు. ఎంతో మందికి ప్రయోజనం : నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే ఈ రైల్వే లైన్ ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చనుంది. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ప్రజలకు నెరవేరింది.నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాల ప్రజలు ఈ మార్గం ద్వారా తిరుపతికి రైలు ద్వారా వెళ్లే వెసలు బాటు కలుగుతుంది. నంద్యాల, మద్దూరు, కొత్తూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, నొన్సం, జమ్మలమడుగు మీదుగా ఎర్రగుంట్లకు చేరుతుంది. సెఫ్టీ రన్‌తో రైళ్ల రాకపోకలు: నంద్యాల - ఎర్రగుంట్ల మీదుగా రైల్వేశాఖ అధికారులు సేఫ్టీరన్ చేపట్టనున్నారు. పట్టాల పటిష్టతను పరిశీలించిన అనంతరం రైలు నడుపుతారు. గుంతకల్ డివిజన్‌కు చెందిన అధికారులు పరిశీలించిన తర్వాత మూడు నెలల తర్వాత నుంచి నిరంతరం రైళ్ల రాకపోకలను చేపడుతారు.