తలపాకలోని 400 కేవీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. నాలుగు జిల్లాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
- ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు
విశాఖపట్నం
తలపాకలోని 400 కేవీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. నాలుగు జిల్లాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామునుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం సామర్లకోట నుంచి శ్రీకాకుళం వరకు విద్యుత్ లేకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ అంతరాయంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నయ ఏర్పాట్ల పై రైల్వే అధికారులు దృష్టి సారించారు. మరి కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.