'చర్చలతో సమస్యల పరిష్కారం'
హైదరాబాద్: విద్యుత్, నీరు పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగడంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై ఏపీ, తెలంగాణ చర్చలు జరపాలన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. శ్రీశైలం సమస్యను కృష్ణా వాటర్ బోర్డు, విద్యుత్ వివాదాలను కేంద్రం పరిష్కరిస్తాయని తెలిపారు.
హుదూద్ తుపాను బాధితులకు గవర్నర్ సానుభూతి తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు త్వరగా యధాస్థితికి రావాలని ఆయన ఆకాంక్షించారు. సుందర నగరం విశాఖపట్నం గతంలో మాదిరిగా తయారు కావాలని ఆయన కోరుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యవసర వస్తువులను అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన తీసుకోవాలని ఆయన ఆదేశించారు.