హైదరాబాద్: వనస్థలిపురం గణేష్ నగర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడిని హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. సగానికిపై కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. హంతకులు ఎవరనేది కూడా తెలియదు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఈ యువకుడిని ఎవరైనా హత్య చేయించి ఉంటారేమోనన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు స్థానికులు ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు.
యువకుడిని హత్యచేసి పెట్రోల్పోసి నిప్పంటించారు
Published Thu, Nov 21 2013 9:12 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement