స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు | special deputy collector arrest | Sakshi
Sakshi News home page

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు

Published Tue, Sep 8 2015 10:45 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

special deputy collector arrest

హైదరాబాద్: నిబంధనలు పాటించకుండా భూమి కేటాయింపులు జరిపారని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్యను వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి ఆయన భూమిని కేటాయించిన కేసులో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. హయత్ నగర్ మండలం తుర్కయాంజల్లోని సర్వే నంబర్ 52లో పది ఎకరాల భూమిని నిబంధనలు పాటించకుండా డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్య మంజూరు చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement