నగరంలోని వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. హస్తినాపురంలో శుక్రవారం ఉదయం ఓ బాలుడు క్రేన్ కిందపడి మృతి చెందాడు. హస్తినాపురంలో నర్సరీ చదువుతున్న విద్యార్థి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన క్రేన్ వాహనం బాలుడుని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. స్తానికుల వెంటనే స్పందించి క్రేన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని స్తానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.