నగరంలోని వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ బ్రేక్ బదులు ఎక్సలేటర్‌ను తొక్కడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శుక్రవారం ఉదయం మారుతి ఆల్టో కారు డ్రైవర్ తత్తరపాటుతో ఎక్సలేటర్ తొక్కడంతో విజయవాడ రహదారిపై రాఘవేంద్ర హోటల్ సమీపంలో అదుపుతప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తర్వాత రోడ్డు దాటుతున్న ఎస్.సారంగపాణి (65) అనే వ్యక్తి పైకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారు డ్రైవర్ పరారైయ్యాడు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
(తుర్కయాంజల్)