
చావు ఎలా వస్తుందో చెప్పలేం!
హైదరాబాద్: వనస్థలిపురం ఆటోనగర్లో విషాదం నెలకొంది. కార్ల షెడ్డులో పని చేసే కార్మికుడు అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కొన్ని కొన్ని సందర్భాలలో చావు ఎలా వస్తుందో చెప్పలేం. కారును పైకి లేపి మరమ్మతులు చేస్తుండగా, అది లక్ష్మణ్ అనే కార్మికుడిపై పడింది. ఆ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
వెంటనే ఆ షెడ్డు యజమాని పారిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుంటున్నారు.