హైదరాబాద్ : వనస్థలిపురం సమీపంలోని చింతలకుంటలో దొంగలు హల్చల్ చేశారు. ఏకకాలంలో రెండు బ్యాంకుల ఏటీఎంలలో చోరికి గుర్తుతెలియని దుండగులు విఫలయత్నం చేశారు. ఎస్బీఐ, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.